Rana Naidu Trailer : రానా వర్సెస్ వెంకటేష్.. పవర్‌ఫుల్ రానా నాయుడు ట్రైలర్ రిలీజ్.. దగ్గుబాటి అభిమానులకు పండగే..

ట్రైలర్ చాలా యాక్షన్, ఎమోషన్ మోడ్ లో చూపించారు. ట్రైలర్ లాస్ట్ లో రానా వెంకటేష్ మీదకి తుపాకీ పట్టుకొని వచ్చిన సీన్ అయితే ట్రైలర్ కి హైలెట్ గా నిలిచింది. ట్రైలర్ చూస్తుంటేనే ఈ రానా నాయుడు సిరీస్ లో రానా, వెంకటేష్ ఇద్దరూ కూడా పోటాపోటీగా నటించినట్టు తెలుస్తుంది...........

Rana Naidu Trailer : రానా వర్సెస్ వెంకటేష్.. పవర్‌ఫుల్ రానా నాయుడు ట్రైలర్ రిలీజ్.. దగ్గుబాటి అభిమానులకు పండగే..

Venkatesh and Rana Netflix series Rana Naidu Trailer Released

Rana Naidu Trailer :  స్టార్ హీరోలు కలిసి చేసే మల్టీస్టారర్స్ మనకి చాలా ఇంట్రెస్ట్. ఇటీవల అలాంటి మల్టీస్టారర్స్ రెగ్యులర్ గా రావడం మొదలయ్యాయి. అలాంటి మల్టీస్టారర్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తాం. ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు కలిసి చేస్తే ఆ ప్రాజెక్టుపై మరిన్ని అంచనాలు ఉంటాయి. తెలుగులో ఫ్యాన్స్ తో, సినిమాలతో సంబంధం లేకుండా అందరికి ఇష్టమైన హీరో విక్టరీ వెంకటేష్. వెంకీ మామ అంటే మన అందరికి చాలా ఇష్టం. ఇప్పటికే రకరకాల పాత్రలతో మెప్పించిన వెంకీ మామ ఈ సారి నెట్‌ఫ్లిక్స్ కోసం రానా నాయుడు సిరీస్ తో మరో సరికొత్త పాత్రలో రాబోతున్నట్టు మనకు ఆల్రెడీ తెలిసిందే. ఇందులో రానా, వెంకటేష్ ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ కోసం భారీగా ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ఈ సిరీస్ సౌత్ భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది. చాలా రోజుల నుంచి వెంకీ మామ అభిమానులు, దగ్గుబాటి అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఈ సిరీస్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్ ట్రైలర్ ని విడుదల చేసింది.

ఇక ట్రైలర్ లో.. బాలీవుడ్ సెలబ్రిటీలకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సాల్వ్ చేసే ఓ పర్సన్ గా ఓ నెగిటివ్ రోల్ లో రానా ఇందులో కనిపించబోతున్నాడు. ఓ పెద్ద ప్రాబ్లమ్ రానా క్రియేట్ చేస్తే ఇందులో రానా ఉన్నట్టు తెలిసిపోతుంది. అయితే రానాని ఆపగలిగేది ఒక్కడే అని వెంకటేష్ ని జైలు నుంచి విడుదల చేస్తారు. ఇందులో వెంకటేష్ లుక్ చాలా కొత్తగా ఉంది. ఒక వయసు మళ్ళిన పాత్రలో, రానా తండ్రిగా చాలా పవర్ఫుల్ గా చూపించారు. వీరిద్దరూ పోటీపడబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. నేను మంచి చేసినా, చెడు చేసినా నా ఫ్యామిలీ కోసమే అని వెంకటేష్ చెప్పడం, వెంకటేష్ ఎందుకు అప్పుడే రిలీజ్ అయ్యాడు అంటూ రానా ఫైర్ అవ్వడం.. ఇలా ట్రైలర్ చాలా యాక్షన్, ఎమోషన్ మోడ్ లో చూపించారు. ట్రైలర్ లాస్ట్ లో రానా వెంకటేష్ మీదకి తుపాకీ పట్టుకొని వచ్చిన సీన్ అయితే ట్రైలర్ కి హైలెట్ గా నిలిచింది. ట్రైలర్ చూస్తుంటేనే ఈ రానా నాయుడు సిరీస్ లో రానా, వెంకటేష్ ఇద్దరూ కూడా పోటాపోటీగా నటించినట్టు తెలుస్తుంది.

Rana Naidu Trailer Launch event : రానా నాయుడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ..

ఇక ఈ రానా నాయుడు సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ముంబైలో గ్రాండ్ గా నిర్వహించింది నెట్ ఫ్లిక్స్. నెట్ ఫ్లిక్స్ సొంత నిర్మాణంలో ఈ సిరీస్ తెరకెక్కుతుంది. రానా, వెంకటేష్, సుర్వీన్ చావ్లా, జెస్సికా హారిసన్, సుచిత్రా పిళ్ళై, రాజేష్ జైస్, ఆశిష్ విద్యార్ధి.. మరికొంతమంది బాలీవుడ్ నటీనటులు ఇందులో నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న రానా నాయుడు సిరీస్ మార్చ్ 10 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వనుంది. ఈ సిరీస్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.