MAA Elections 2021 : అడ్వాన్స్ కంగ్రాట్స్ విష్ణు..

‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ గరించి ప్రస్తుత ‘మా’ ఆపద్ధర్మ అధ్యక్షుడు నరేష్ కామెంట్స్ చేశారు..

MAA Elections 2021 : అడ్వాన్స్ కంగ్రాట్స్ విష్ణు..

Vk Naresh

Updated On : November 5, 2021 / 10:29 AM IST

MAA Elections 2021: ‘మా’ ఎన్నకల తేది దగ్గర పడుతుండడంతో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న వాళ్లు తమ ప్యానెల్స్‌ను  ప్రకటిస్తున్నారు. ఇటీవల విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తన ప్యానెల్‌ని ప్రకటించిన సంగతి తెలిసిందే.. గురువారం యంగ్ హీరో మంచు విష్ణు కూడా తన ప్యానెల్‌ని అనౌన్స్ చేశారు.

MAA Elections: మంచు విష్ణు ప్యానెల్ ఇదే.. హీట్ పెంచేస్తున్న మా ఎలక్షన్!

ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాబు మోహన్.. ఉపాధ్యక్షులుగా మాదల రవి, పృథ్వీరాజ్, జాయింట్ సెక్రటరీలుగా కరాటే కళ్యాణి, గౌతమ్ రాజ్ పోటీలో ఉన్నారు. అయితే మంచు విష్ణు ప్యానెల్ గరించి ప్రస్తుత ‘మా’ ఆపద్ధర్మ అధ్యక్షుడు నరేష్ కామెంట్స్ చేశారు. విష్ణు ప్యానెల్ విజయం సాధించాలని విషెస్ తెలియజేశారు.

Evaru Meelo Koteeswarulu : ‘చారి’ కోసం ‘గురువు గారు’..!

ఆయన మాట్లాడుతూ.. ‘‘మంచు విష్ణు ప్యానెల్ చాలా ఫ్రెష్‌గా, పాజిటివ్‌గా ఉంది.. ముఖ్యంగా వివాదాస్పద వ్యక్తులు లేరు. అందరూ చదువుకున్న వాళ్ళు, మంచి వాళ్ళు ఉన్నారు.. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. అది సంతోషం.. అన్ని ప్రాంతాలను గౌరవిస్తూ స్థానికులకు పెద్ద పీఠ వేశారు.. విష్ణు ప్యానెల్ విజయానికి ఇవన్నీ తోడ్పడతాయి.. చదువుకున్న వాళ్ళు, అనుభవజ్ఞులు, యువత, ఫ్రెష్‌గా వచ్చిన వాళ్ళు అందరూ కలసి ఒక మంచి ప్యానెల్‌గా ఏర్పాడ్డారు.. మేనిఫెస్టో కూడా ఇంతే బాగుండాలి అని నేను కోరుకుంటున్నాను.. అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్ విష్ణు’’.. అన్నారు..