వరుణ్ తేజ్ (VT10) – ప్రారంభం

అల్లు అరవింద్ సమర్పణలో, రినైస్సాన్స్ – బ్లూ వాటర్ క్రియేటివ్ బ్యానర్‌లో అల్లు బాబీ, సిద్ధు నిర్మిస్తున్న VT 10 (వర్కింగ్ టైటిల్) ఫిలింనగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

  • Published By: sekhar ,Published On : October 10, 2019 / 07:47 AM IST
వరుణ్ తేజ్ (VT10) – ప్రారంభం

Updated On : October 10, 2019 / 7:47 AM IST

అల్లు అరవింద్ సమర్పణలో, రినైస్సాన్స్ – బ్లూ వాటర్ క్రియేటివ్ బ్యానర్‌లో అల్లు బాబీ, సిద్ధు నిర్మిస్తున్న VT 10 (వర్కింగ్ టైటిల్) ఫిలింనగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

రీసెంట్‌గా ‘గద్దలకొండ గణేష్’ తో మంచి హిట్ అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కి రెడీ అవుతున్నాడు. సినిమా సినిమాకి వైవిధ్యం చూపించడానికి ప్రయత్నించే వరుణ్ ఈ సారి కిక్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. కిరణ్ కొర్రపాటి  దర్శకుడిగా పరిచయమవుతుండగా.. అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు వెంకటేష్ (అల్లు బాబీ) ఈ సినిమా ద్వారా నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.

అల్లు అరవింద్ సమర్పణలో, రినైస్సాన్స్ – బ్లూ వాటర్ క్రియేటివ్ బ్యానర్‌లో అల్లు బాబీ, సిద్ధు నిర్మిస్తున్న VT 10 (వర్కింగ్ టైటిల్) ఫిలింనగర్ దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. వరుణ్ తేజ్ 10వ సినిమా ఇది. వరుణ్ తేజ్, నాగబాబు, అల్లు అరవింద్, డా.వెంకటేశ్వర రావు, కిరణ్ కొర్రపాటి, సిద్ధు తదితరులు పాల్గొన్నారు.

Read Also : ప్రభాస్ బర్త్‌డేకి ఆన్‌లైన్‌లో సాహో!

డిసెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సినిమా కోసం వరుణ్.. లాస్ ఏంజెల్స్‌లో బాక్సింగ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. సంగీతం : థమన్, కెమెరా : జార్జ్ సి విలియమ్స్.. నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి.