Waltair Veerayya: సెన్సార్ పనులు ముగించుకున్న ‘వాల్తేరు వీరయ్య’

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రాబోతుందని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాతో మెగాస్టార్ మరోసారి బాక్సాపీస్ వద్ద కుమ్మేయడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.

Waltair Veerayya: సెన్సార్ పనులు ముగించుకున్న ‘వాల్తేరు వీరయ్య’

Waltair Veerayya Completes Censor Works

Updated On : January 2, 2023 / 9:56 PM IST

Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రాబోతుందని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాతో మెగాస్టార్ మరోసారి బాక్సాపీస్ వద్ద కుమ్మేయడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.

Waltair Veerayya : ‘నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందర ఎక్కువ’ అంటూ మరో పాట లీక్ చేసిన చిరు..

కాగా, తాజాగా వాల్తేరు వీరయ్య చిత్రం సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ సినిమాతో చిరంజీవి తన అభిమానులకు మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నాడని సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ సినిమాలో మెగాస్టార్ డ్యాన్స్ ప్రేక్షకులను కట్టిపడేయనుందని.. ఆయన పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో మెగా ఫ్యాన్స్‌కు ఫీస్ట్ ఖాయమని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.

Waltair Veerayya movie song launch : పాటకే ఇంత రచ్చా.. ఇక సినిమాకి ఏ రేంజ్ లో ఉంటుందో..

ఇక వాల్తేరు వీరయ్యలో మాస్ రాజా రవితేజ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇప్పిటకే ప్రేక్షకులను ఆకట్టుకోగా, అందాల భామ శ్రుతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.