Sai Pallavi : సాయి పల్లవి పెళ్లి అయిపోయిందా..? దర్శకుడి పోస్టుతో తెలిసిన నిజం
నటి సాయి పల్లవి (Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 'ప్రేమమ్' చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా అడుగుపెట్టిన అమ్మడు 'ఫిదా' సినిమాతో తెలుగు వారిని ఫిదా చేసింది.

Sai Pallavi wedding rumours
Sai Pallavi marriage : నటి సాయి పల్లవి (Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రేమమ్ చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా అడుగుపెట్టిన అమ్మడు ఫిదాతో తెలుగు వారిని ఫిదా చేసింది. తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో నటించి తనదైన గుర్తింపు తెచ్చుకుంది. తన సహజ నటనతో పాటు అద్భుతమైన డ్యాన్స్‌తో ప్రేక్షకుల హృదయాల్లో చెదరని ముద్ర వేసింది. చాలా సెలెక్టీవ్‌గా సినిమాలు చేస్తూ వస్తోంది. గతేడాది చివరల్లో విరాటపర్వం, గార్గీ చిత్రాల తరువాత మరో తెలుగు సినిమాలో కనిపించలేదు.
అయితే.. సాయిపల్లవి పెళ్లి కోసమే బ్రేక్ తీసుకుందనే వార్తలు వినిపించాయి. ఇప్పడేమో సోషల్ మీడియాలో పెళ్లిదండతో ఉన్న ఫోటో ఒకటి వైరల్‌గా మారింది. ఆమె పక్కనే మరో వ్యక్తి ఉండడంతో ఫ్యాన్స్ షాక్ కు గురైయ్యారు. సాయి పల్లవి నిజంగానే పెళ్లి చేసుకుందా..? అని ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే.. అసలు విషయం ఏంటి అనేది తెలియక తికమక అవుతున్నారు. ఈ క్రమంలో విరాట పర్వం దర్శకుడు వేణు ఊడుగుల ఫేస్ బుక్‌లో చేసిన పోస్ట్‌తో అందరికి ఓ స్పష్టత వచ్చింది.
ఈ దర్శకుడు సాయి పల్లవి పెళ్లి కి స్పందించి ఎటువంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ అతడు పోస్ట్ చేసిన ఫోటో అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ ఫోటో నటుడు శివ కార్తికేయ తమిళ సినిమా పూజా కార్యక్రమంలోనిది అంటూ ఫేస్ బుక్‌లో వేణు ఊడుగుల పోస్ట్ చేశాడు. దర్శకుడు పోస్ట్ చేసిన ఫోటో, సాయి పల్లవికి పెళ్లి అయిపోయిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో ఒకటే కావడం గమనార్హం. అక్కడ హాఫ్ ఫోటో మాత్రమే ఉండగా, దర్శకుడు వేణు పూర్తి ఫోటోను పోస్ట్ చేయడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. సాయి పల్లవికి పెళ్లి అయిందని వచ్చిన వార్తలు అబద్దం అని తేలిపోయాయి. దీంతో ఆమె ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు.
Cool Suresh : లేడీ యాంకర్‌తో తమిళ నటుడు తప్పు ప్రవర్తన.. భార్య అభ్యంతరంతో క్షమాపణలు..
ఇక సినిమాల విషయానికి వస్తే.. సాయి పల్లవి ప్రస్తుతం శివ కార్తికేయన్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. దేశభక్తి నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కుతుంది. కాశ్మీర్ లో ఓ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. అంతేకాకుండా నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో సైతం సాయి పల్లవి నటిస్తోంది.