Aamir Khan : అమీర్ ఖాన్ కాలికి ఏమైంది? ఎందుకు స్టిక్ పట్టుకొని నడుస్తున్నాడు? ఆందోళనలో అభిమానులు..

అమీర్ ఖాన్ ఎక్కువగా కనపడట్లేదు. తన కూతురి నిశ్చితార్థంలో కనపడ్డాడు, ఆ తర్వాత ఓ పెళ్ళిలో కనపడ్డాడు. తాజాగా ది వాల్ట్ డిస్నీ కంపెనీ ఇండియా మరియు స్టార్ ఇండియా అధ్యక్షుడు కె మాధవన్‌ కుమారుడు వివాహం రాజస్థాన్ జైపూర్ లోని ఓ కోటలో జరగగా అక్కడికి విచ్చేశాడు..................

Aamir Khan : అమీర్ ఖాన్ కాలికి ఏమైంది? ఎందుకు స్టిక్ పట్టుకొని నడుస్తున్నాడు? ఆందోళనలో అభిమానులు..

What happened to Aamir Khan? why he using stick for walking?

Updated On : February 11, 2023 / 9:35 AM IST

Aamir Khan :  అమీర్ ఖాన్ చాలా గ్యాప్ తర్వాత లాల్ సింగ్ చద్దా సినిమాతో ఎన్నో హోప్స్ తో వచ్చినా ఆ సినిమా భారీ పరాజయం పాలైంది. ఆ సినిమా పరాజయం తర్వాత కొన్ని రోజులు సినిమాలకి దూరంగా ఉంటాను అని అందరికి షాక్ ఇచ్చాడు. అప్పట్నుంచి అమీర్ ఖాన్ ఎక్కువగా కనపడట్లేదు. తన కూతురి నిశ్చితార్థంలో కనపడ్డాడు, ఆ తర్వాత ఓ పెళ్ళిలో కనపడ్డాడు. తాజాగా ది వాల్ట్ డిస్నీ కంపెనీ ఇండియా మరియు స్టార్ ఇండియా అధ్యక్షుడు కె మాధవన్‌ కుమారుడు వివాహం రాజస్థాన్ జైపూర్ లోని ఓ కోటలో జరగగా అక్కడికి విచ్చేశాడు.

Amigos : అమిగోస్ రివ్యూ.. కొంచెం కన్ఫ్యూజ్ చేసినా సూపర్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన కళ్యాణ్ రామ్..

అయితే ఈ పెళ్ళిలో సాంప్రదాయ వస్త్రాలు కట్టుకొని వచ్చిన అమీర్ ఖాన్ చేత్తో స్టిక్ పట్టుకొని చాలా జాగ్రత్తగా నడుస్తున్నాడు. అమీర్ ఖాన్ చేత్తో స్టిక్ పట్టుకొని నడుస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో అమీర్ అభిమానులంతా ఆందోళన చెందుతున్నారు. అమీర్ ఖాన్ కి ఏమైంది? కాలికి ఏమన్నా అయిందా? ఎందుకు స్టిక్ పట్టుకొని నడుస్తున్నాడు అని అమీర్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై ఎవరూ సమాధానం ఇవ్వలేదు. మరి అమీర్ దీనిపై స్పందిస్తాడేమో చూడాలి. ఇక అమీర్ త్వరగా మళ్ళీ సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.