Bhoot Shuddi Vivaha: ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత.. అసలు దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?

సౌత్ బ్యూటీ నటి సమంత రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ (Bhoot Shuddi Vivaha)నిర్మాత, దర్శకుడు రాజ్‌ నిడిమోరు సోమవారం ఉదయం ఆమె వివాహం చేసుకున్నారు.

Bhoot Shuddi Vivaha: ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత.. అసలు దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?

What is special about a Bhoot Shuddi Vivaha

Updated On : December 1, 2025 / 6:46 PM IST

Bhoot Shuddi Vivaha: సౌత్ బ్యూటీ నటి సమంత రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత, దర్శకుడు రాజ్‌ నిడిమోరు సోమవారం ఉదయం ఆమె వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులో ఉన్న ఈశా యోగ కేంద్రంలోని లింగ భైరవి దేవి సన్నిధిలో వీరి వివాహం చాలా గోప్యాంగా జరిగింది. ఈ పెళ్లి కూడా ‘భూత శుద్ది వివాహం’ పద్దతిలో పెళ్లి చేసుకున్నారు ఈ జంట. అయితే, ఈ ‘భూత శుద్ది వివాహం’ అనే మాట బయటకు వచ్చినప్పటి నుంచి దాని గురించి తెలుసుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. అసలు ఈ ‘భూత శుద్ది వివాహం’ అంటే ఏమిటి? దాని ప్రత్యేకత ఏంటి? ఎందుకు చేస్తారు? అనేది తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Rashi Singh: ట్రెండీ లుక్స్ లో రాశి సింగ్.. పొట్టి డ్రెస్ లో గ్లామర్ డోస్ పెంచేసింది.. ఫోటోలు

‘భూత శుద్ది వివాహం’ ప్రత్యేకత ఏమిటంటే?

‘భూత శుద్ది వివాహం’ అనేది అనాదిగా వస్తున్న యోగ సంప్రదాయం. ఈ సంప్రదాయం ప్రకారం ‘భూత శుద్ది వివాహం(Bhoot Shuddi Vivaha)’ చేసుకుంటే ఆలోచనలు, భావోద్వేగాలు, భౌతికతకు అతీతంగా, దంపతుల మధ్య లోతైన బంధం ఏర్పడుతుందని ప్రతీతి. లింగ భైరవి దేవాలయాల్లో, ఎంపిక చేసిన కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఈ వివాహ క్రతువుని నిర్వహిస్తారు. దంపతుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేస్తుంది ఈ ప్రక్రియ. అలాగే దాంపత్య ప్రయాణంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా చేస్తుంది. సమంత మొదటి వివాహం రద్దు అయిన విషయం తెలిసిందే. ఆలాగే దర్శకుడు రాజ్ జీవితంలో కూడా ఇది రెండో పెళ్లి. అందుకే ఈ బంధమైనా బలంగా నిలవాలని ఈ ‘భూత శుద్ది వివాహం’ చేసుకున్నారు సమంత-రాజ్.