Pushpa 2 : ‘పుష్ప 2’లో ఆ సీన్లు లేవేంటి? పార్ట్ 3లో ఉంటాయా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన మూవీ పుష్ప 2.

Pushpa 2 : ‘పుష్ప 2’లో ఆ సీన్లు లేవేంటి?  పార్ట్ 3లో ఉంటాయా?

Where is Pushpa scene is not there in Pushpa 2

Updated On : December 5, 2024 / 12:49 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన మూవీ పుష్ప 2. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా నేడు (గురువారం న‌వంబ‌ర్ 5) ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మొద‌టి ఆట నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ అందుతోంది. ప్రీమియ‌ర్స్, బెనిఫిట్ షోస్ చూసిన వారు సినిమా అదిరిపోయింద‌ని, ముఖ్యంగా జాత‌ర ఎపిసోడ్ చిత్రానికే హైలెట్‌గా నిలుస్తుంద‌ని చెబుతున్నారు.

ఈ చిత్రం పుష్ప సినిమాకి సీక్వెల్‌గా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. కాగా.. సుమారు ఓ సంవ‌త్స‌రం క్రితం పుష్ప ఎక్క‌డ ఉన్నాడు అంటూ చిత్ర బృందం ఓ గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది. దాదాపు మూడు నిమిషాల 14 సెక‌న్ల పాటు ఈ గ్లింప్స్ ఉంది. అందులో తిరుప‌తి జైలు నుంచి పుష్ప త‌ప్పించుకున్నాడ‌ని, అత‌డికి బుల్లెట్ గాయాలు అయిన‌ట్లుగా చూపించారు.

Pushpa 2 : ఫాన్స్ కి, ప్రేక్షకులకి భారీ షాక్ ఇచ్చిన హైదరాబాద్ బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్..

అత‌డి కోసం పోలీసులు తీవ్రంగా వెతుకుతుండ‌గా, పుష్ప అభిమానులు రోడ్ల పైకి వ‌చ్చి పెద్ద ఎత్తున పోరాటాలు చేయ‌డాన్ని చూపించారు. ఇందులో ఓ టీవీ ఛాన‌ల్ యాంక‌ర్‌గా బిగ్‌బాస్ ఫేమ్ దివీ సైతం క‌నిపించింది. ఆఖ‌రిలో పులితో పాటు పుష్ప క‌నిపించాడు. అయితే.. ఈ సీన్ పుష్ప 2 చిత్రంలో లేదు. దీనితో పాటు ఇటీవ‌ల ట్రైల‌ర్‌లో బ‌న్వ‌ర్ సింగ్ షెకావ‌త్ నీటిలోంచి పైకి లేచి స్నానం చేయ‌డాన్ని చూయించారు. ఈ సీన్ సైతం మూవీలో లేదు.

పుష్ప 2 మూవీ నిడివి ఇప్ప‌టికే మూడు గంట‌ల‌కు పైగా ఉంది. దీంతో చిత్ర నిడివి ఎక్కువ‌గా ఉండ‌డంతో ఈ సీన్స్‌ను తీసివేశారా ? లేక ఈ చిత్రం ఆఖ‌రిలో పార్ట్ 3 ఉంటుంద‌ని హింట్ ఇచ్చారు. దీంతో ఈ సీన్స్ అందులో ఉంటాయా అన్న‌ది తెలియాల్సి ఉంది.

Rishab Shetty : వామ్మో.. రిషబ్ శెట్టి మూవీ లైనప్ చూసారా.. ఏకంగా అన్ని సినిమాలా..