‘విజిల్’ – రివ్యూ
దళపతి విజయ్, నయనతార జంటగా.. అట్లీ దర్శకత్వంలో నటించిన ‘విజిల్’ దీపావళి కానుకగా తెలుగు, తమిళ్‌లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది..

దళపతి విజయ్, నయనతార జంటగా.. అట్లీ దర్శకత్వంలో నటించిన ‘విజిల్’ దీపావళి కానుకగా తెలుగు, తమిళ్‌లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది..
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ‘తుపాకీ’ సినిమా నుండి తెలుగు ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. లాస్ట్ ఇయర్ మురగదాస్ డైరెక్షన్‌లో ‘సర్కార్’ మూవీతో సక్సెస్ కొట్టిన విజయ్ ఈ సారి యంగ్ డైరెక్టర్ అట్లీతో కలిసి ‘బిజిల్’ మూవీని తెరకెక్కించాడు.. ఈసినిమా తెలుగులో ‘విజిల్’ పేరుతో రిలీజ్ అయ్యింది. ఇంతకు ముందు అట్లీ ‘పోలీసుడు’ (తెరి), ‘అదిరింది’ (మెర్సల్) మూవీతో విజయ్‌కు మంచి హిట్ ఇచ్చాడు.. ఈసారి కూడా విజయ్‌కు సక్సెస్‌ఫుల్ మూవీ ఇవ్వగలిగాడా లేదా చూద్దాం…
కథ విషయానికి వస్తే : ఓ కాలేజీని కబ్జా చేసిన రాజకీయ నాయకుణ్ణి విద్యార్ధులు ఎదిరించే అంశాలతో సినిమా ప్రారంభం అవుతుంది. ఫుట్‌బాల్ ప్లేయర్ అయిన మైఖేల్ అలియాస్ బిగిల్ తన చుట్టూ ఉన్న వారికి సాయం చేస్తూ… బస్తీ ప్రజలకు అండగా ఉంటాడు. ఆబస్తీకి రౌడీ అయిన తన తండ్రి రాజప్ప.. కక్షలు.. గొడవలకు దూరంగా ఉంటూ.. తన కుమారుడు మైఖేల్‌ను ఫుట్‌బాల్ ప్లేయర్‌గా జాతీయ స్థాయిలో ఆడి ట్రోఫీ కప్పును గెలవాలి అని కోరుకుంటాడు. అయితే కొన్ని అనుకోని సంఘటనల వల్ల మైఖేల్ తన తండ్రి వారసత్వాన్ని పుచ్చుకుని మళ్ళీ రౌడీగా మారతాడు. తన స్నేహితుడైన ఫుట్ బాల్ కోచ్‌కి జరిగిన యాక్సిడెంట్ వల్ల, జాతీయ స్థాయిలో ఆడాల్సిన తన జట్టు సభ్యులకు మైఖేల్ కోచ్‌గా మారతాడు. ఫుట్‌బాల్ ప్లేయర్ అయిన మైఖేల్ ఆటకు ఎందుకు దూరం కావాల్సి వచ్చింది. ఫుట్‌బాల్ కోచ్‌గా అతను ఎదుర్కొన్న సవాళ్లేంటి? వాటిని మైఖేల్ ఎలా అధిగమించాడు? మైఖేల్ జీవితంలో ఏంజెల్ పాత్ర ఏంటి? తన తండ్రి కోరికను మైఖేల్ తీర్చాడా లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
నటీనటుల విషయానికి వస్తే : ఈ సినిమాకి ఇంత భారీ మైలేజ్ దక్కడానికి ప్రధాన కారణం విజయ్. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో విజయ్ అదరగొట్టాడు. కొడుకు మైఖేల్ పాత్ర స్టైలిష్‌గా ఉన్నా.. సినిమాకి వెయిట్ తీసుకొచ్చింది మాత్రం విజయ్ పోషించిన రెండో పాత్ర రాజప్ప క్యారెక్టర్. తండ్రీ కొడుకులుగా వేరియేషన్స్ చూపిస్తూ ఆకట్టుకున్నాడు. రాజప్ప క్యారెక్టర్ వల్ల తెలుగులో కూడా విజయ్‌కి సాలిడ్ మార్కెట్ క్రియేట్ అవుతుంది. లేడీ సూపర్‌స్టార్ నయనతార నటన గురించి కొత్తగా చెప్పుకోనక్కరలేదు. ఆమెకు ఇచ్చిన లిమిటెడ్ రోల్‌లో అదరగొట్టింది. జాకీష్రాఫ్ క్యారెక్టర్ మాత్రం మామూలుగా ఉంది. వివేక్, యోగిబాబు లాంటి సీనియర్ కమెడియన్ల నటన ఆకట్టుకుంది. వాళ్ళ కామెడీ బాగా పండింది. తెలుగు వాళ్ళకి పెద్దగా పరిచయం లేని మిగతా నటీనటులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా పాత్రల పరిధిమేర క్లీన్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
టెక్నీషియన్స్ విషయానికి వస్తే :
ఈ సినిమాకి రైటర్ కమ్ డైరెక్టర్ అయిన అట్లీ కుమార్ మొదట ఒక రెగ్యులర్ సినిమాగానే దీన్ని మొదలుపెట్టాడు. విజయ్ ఫ్యాన్స్ కోసం పాట, ఒక చిన్న లవ్‌ట్రాక్.. ఇలానే ఒక అర గంట నడిచిన ఈ సినిమా అక్కడి నుండి గేర్ మార్చింది. ఫుట్‌బాల్ మ్యాచెస్ అంటూ ఒక కొత్త ఫీల్ ఇస్తుంది. ఎప్పుడైతే కథలోకి రాజప్ప క్యారెక్టర్ ఎంటర్ అయ్యిందో అప్పుడే ‘విజిల్’ రేంజ్ మారిపోయింది. సినిమాకు అవసరమైన వెయిట్ ఉండేలా ఆ పాత్రని మలిచాడు అట్లీ. సెకండ్ హాఫ్ కూడా గ్రిప్పింగ్‌గా స్టోరీ డ్రివెన్ కంటెంట్‌తోనే నడిచింది. A.R. రెహమాన్ మ్యూజిక్ ఇక్కడ పెద్దగా ఎక్కకపోయినా తమిళ్‌లో వర్క్ అవుట్ అవుతుంది. ఆర్.ఆర్. బావుంది. G.K.విష్ణు సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్. నిర్మాణ విలువలకు తిరుగులేదు.
ఫైనల్‌గా చెప్పాలంటే :
డు బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇచ్చిన బ్రిలియంట్ కాంబినేషన్‌లో వచ్చిన ‘విజిల్’ కూడా మాస్ మసాలా అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి ఇన్స్పైరింగ్ కథతో నడిచింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న డల్ సీజన్‌ని క్యాష్ చేసుకుంటూ ‘విజిల్’ కమర్షియల్‌గా కూడా బాగానే సంపాదించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.