Guppedantha Manasu : మినిస్టర్ ఎంట్రీతో కథలో ట్విస్ట్.. ఎండీగా రిషి బాధ్యతలు చేపడతాడా?

చెక్ ఫ్రాడ్ విషయంలో శైలేంద్రతో సారధిని పిలిపించమని చెబుతుంది వసుధర. దేవయాని, శైలేంద్ర షాకవుతారు. జగతికి నివాళులు అర్పించడానికి మహేంద్ర ఇంటికి మంత్రి వస్తాడు. ఆ తరువాత 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో ఏం జరిగింది?

Guppedantha Manasu : మినిస్టర్ ఎంట్రీతో కథలో ట్విస్ట్.. ఎండీగా రిషి బాధ్యతలు చేపడతాడా?

Guppedantha Manasu

Updated On : October 11, 2023 / 12:51 PM IST

Guppedantha Manasu Today Episode: రిషియే సారధికి చెక్ ఇచ్చినట్లు అబద్ధం చెప్పమన్నది జగతి అని నిజం బయటపెడుతుంది వసుధర. రిషి మీద జరిగిన వరుస అటాక్స్ వల్ల కూడా తాను జగతి చెప్పినట్లు చేసానంటుంది వసుధర. జగతికి నివాళులు అర్పించడానికి మంత్రి ఎంట్రీ ఇవ్వడంతో ‘గుప్పెడంత మనసు’ ‘సీరియల్‌లో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది.

జగతి మేడంని ఎవరో భయపెట్టారని హాలులో అందరి ఎదురుగా రిషికి చెబుతుంది వసుధర. కాలేజీలో పూల కుండీ రిషీ మీద పడటం, కారులో వెళ్తుంటే లారీతో గుద్దించడం, గెస్ట్ హౌస్‌లో రౌడీ దాడి చేయడం ఇవన్నీ జగతిని భయపెట్టాయని చెబుతుంది వసుధర. చెక్ ఫ్రాడ్ విషయంలో శైలేంద్ర ఫ్రెండ్ అయిన సారధిని పిలిపించమని శైలేంద్రని ఇరికిస్తుంది. ఏమీ ఎరగనట్లు సారధిని పిలిపిస్తానంటాడు శైలేంద్ర.

Guppedantha Manasu : శైలేంద్ర నెక్ట్స్ టార్గెట్ రిషీయేనా? జగతి మరణం తర్వాత ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో ఏం జరగబోతోంది?

మహేంద్ర జగతిని మర్చిపోలేక ఆల్కహాల్ తాగుతూనే ఉంటాడు. తాగి హాలులోకి వచ్చిన మహేంద్రని ఫణీంద్ర ఇలా అయితే ఎలా మహేంద్ర?.. నిన్ను కూడా కోల్పోవడానికి మేం సిద్ధంగా లేమని బాధపడతాడు. మీరు బాగుండాలని కోరుకోవడం వల్లే నాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అంటాడు ఫణీంద్రతో మహేంద్ర. నా వల్ల ఈ పరిస్థితి వచ్చిందా? నీకు అని తమ్ముడిని అడుగుతాడు ఫణీంద్ర. నా మనసులోంచి వచ్చిన మాట నిజమో అబద్ధమో మీ ఊహకే వదిలేస్తున్నా అంటాడు. మరోవైపు దేవయాని, శైలేంద్రకు భయం పట్టుకుంటుంది. సారధి ఇండియాలో లేనందున టెన్షన్ పడొద్దని తల్లి దేవయానికి ధైర్యం చెబుతాడు శైలేంద్ర. దేవయాని ఊపిరి పీల్చుకుంటుంది.

జగతికి నివాళులు అర్పించడానికి మంత్రి.. మహేంద్ర ఇంటికి వస్తాడు. జగతి ఫోటో ముందు పూలబొకే పెట్టి నివాళులు అర్పిస్తాడు. జగతి మంచితనాన్ని ఆమె సేవల్ని గుర్తు చేస్తూ ఆమె ఆశయాల్ని నిజయం చేయమని రిషికి చెబుతాడు. మళ్లీ ఎండీగా బాధ్యతలు స్వీకరించమని జగతి త్యాగాన్ని వృధా చేయవద్దని సలహా ఇస్తాడు. తనకు కొంచెం సమయం కావాలంటాడు రిషి. మహేంద్రకి కూడా ధైర్యం చెప్పి మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రిషి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు. ‘గుప్పెడంత మనసు’ సీరియల్ లో ఏం జగరబోతోంది. నెక్ట్స్ ఎపిసోడ్‌లో చూడాల్సిందే.

Guppedantha Manasu : ‘నన్ను జగతి దగ్గరకు పంపేయండి’.. అంటూ వదిన దేవయానిపై విరుచుకుపడ్డ మహేంద్ర.. షాకైన ఫణీంద్ర

‘గుప్పెడంత మనసుసీరియల్‌లో ముకేష్ గౌడ, రక్ష గౌడ, సాయి కిరణ్, జ్యోతి రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కాపుగంటి రాజేంద్ర ఈ సీరియల్‌ని డైరెక్ట్ చేస్తున్నారు.