పెళ్లంటే మజాకా? – విజయ్ పర్ఫార్మెన్స్ పీక్స్!

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, ‘ఓనమాలు’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ వంటి హృద్యమైన సినిమాలతో ఆకట్టుకున్న క్రాంతి మాధవ్ కాంబినేషన్లో, సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కయర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్న లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ (World Famous Lover)..
రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఎజబెల్లా, క్యాథరీన్ కథానాయికలు..ఇటీవల విడుదల చేసిన టీజర్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. గురువారం సాయంత్రం థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్‌లో నేచురల్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. రాశీ ఖన్నా, ఎజబెల్లా, క్యాథరీన్‌లతో తన స్టైల్‌లో రొమాన్స్ చేస్తూనే ఇష్టంలేని భార్యతో కాపురం చేసే భర్తగా కనిపించాడు.
ఐశ్వర్య రాజేష్ డీ గ్లామర్ రోల్‌లో సహజంగా కనిపించగా.. పెళ్లికిముందు రాశీ ఖన్నా, ఎజబెల్లాలతో ప్రేమాయణం నడిపిన విజయ్, పెళ్లి తర్వాత కేథరిన్‌తో ప్రేమలో పడతాడని తెలుస్తుంది. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. ఫిబ్రవరి 9న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి సంగీతం : గోపి సుందర్, కెమెరా : జయకృష్ణ గుమ్మడి, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు.