NBK 107 : ఫుల్ కాన్ఫిడెన్స్.. సాయి మాధవ్ బుర్రా ట్వీట్ చూశారా!

NBK 107 మూవీ గురించి రైటర్ సాయి మాధవ్ బుర్రా సెన్సేషనల్ ట్వీట్ చేశారు..

NBK 107 : ఫుల్ కాన్ఫిడెన్స్.. సాయి మాధవ్ బుర్రా ట్వీట్ చూశారా!

Sai Madhav Burra

Updated On : November 14, 2021 / 5:32 PM IST

NBK 107: నటసింహా నందమూరి బాలకృష్ణ.. ఈ సంక్రాంతికి ‘క్రాక్’ తో బ్లాక్‌బస్టర్ అందుకున్న యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. శృతి హాసన్ కథానాయిక. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతమందిస్తున్నారు.

Pushpa The Rise : ‘ఏయ్ బిడ్డా.. ఇది నా అడ్డా’ అంటున్న అల్లు అర్జున్..

నవంబర్ 13న ఈ NBK 107 (వర్కింగ్ టైటిల్) సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. హీరో హీరోయిన్లతో పాటు యూనిట్ అంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రచయిత సాయి మాధవ్ బుర్రా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. ‘‘ఇప్పుడు క్లాప్ కొట్టారు..రిలీజయ్యాక క్లాప్స్ కొడుతూనేవుంటారు’’.. అని ట్వీట్ చేశారాయన.

Sai Dharam Tej : సెవన్ ఇయర్స్ ఫర్ సుప్రీం హీరో..

ప్రస్తుతం టాలీవుడ్‌లో సాయి మాధవ్ బుర్రా మోస్ట్ టాలెంటెడ్ అండ్ మోస్ట్ వాంటెడ్ రైటర్. ‘కృష్ణంవందే జగద్గురుమ్’ తో క్రిష్ వెండితెరకు ఇంట్రడ్యూస్ చేశారు. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ తో ఇండస్ట్రీ చూపు తన వైపు తిప్పుకున్నారు. ‘కంచె’, ‘గౌతమి పుత్ర శాతకర్ణి’, ‘ఖైదీ నంబర్ 150’, ‘మహానటి’, ‘క్రాక్’ ఇలా ఆయన రాసిన మాటలు ఆయా సినిమాలకు హైలెట్ అయ్యాయి.

Balakrishna – Koratala Siva : సెన్సేషనల్ కాంబినేషన్!

ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘ఆర్ఆర్ఆర్’ కి, హిస్టారికల్ మూవీ ‘శాకుంతలం’కి ఆయనే డైలాగ్స్ రాశారు. బాలయ్య – గోపిచంద్ సినిమాకు కూడా బుర్రానే మాటలు అందిస్తున్నారు. సినిమా మీద ఎంత కాన్ఫిడెంట్ లేకపోతే ఆయన చిన్న మాటతో పెద్ద అర్థం వచ్చేలా.. ఫ్యాన్స్‌కి గూస్ బంప్స్ తెప్పించేలా ట్వీట్ చేసారో ఊహించుకోవచ్చు.