Yamudu : నరలోకం వదిలి యముడు భూలోకానికి వస్తే.. అక్కడి శిక్షలు ఇక్కడ వేస్తే? యముడు గ్లింప్స్ రిలీజ్..
జగన్నాధ పిక్చర్స్ పతకం పై జగదీశ్ ఆమంచి స్వీయదర్శకత్వంలో నూతన నటీనటులతో ‘యముడు’అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్‌ని విడుదల చేస్తూ సినిమా గురించి అవగాహన వచ్చేలా ఆసక్తికర విషయాన్ని గ్లింప్స్ రూపంలో ఇచ్చారు.

Yamudu Movie Glimpse Released with new interesting story
Yamudu Movie : తెలుగు తెరపై యముడు ఒక సక్సెస్ ఫార్ములా. అప్పట్లో ఎన్టీఆర్ నుంచి నిన్న మొన్నటివరకు రవితేజ, అల్లరి నరేష్ వరకు అందరూ యముడిని వాడేశారు. ఆల్మోస్ట్ యముడు టైటిల్, యముడు క్యారెక్టర్ తో వచ్చిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. తాజాగా యముడు అనే టైటిల్ తో మరో సినిమా రాబోతుంది. ధర్మో రక్షిత రక్షితః అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు.
జగన్నాధ పిక్చర్స్ పతకం పై జగదీశ్ ఆమంచి స్వీయదర్శకత్వంలో నూతన నటీనటులతో ‘యముడు’అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్‌ని విడుదల చేస్తూ సినిమా గురించి అవగాహన వచ్చేలా ఆసక్తికర విషయాన్ని గ్లింప్స్ రూపంలో ఇచ్చారు. ఈ వీడియోలో.. సృష్టి, లయ, స్థితి కారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో కలిసి లోక సంరక్షకుడు అయిన మహా విష్ణువు వేద, మిత్ర, గురు సార ధర్మములు కాపాడడానికి ఎన్నో అవతారాలు ఎత్తాడని మనకి తెలుసు. కానీ కలియుగంలో మనిషి ధర్మధర్మాలను మరచి సృష్టి వినాశనానికి కారణం అవుతున్నాడు. ధర్మానికి రాజైన యమధర్మ రాజు దుష్టులను శిక్షించడానికి, ధర్మాన్ని రక్షించడానికి భూమి మీద అవతరించాలని తలిస్తే? గరుడ పురాణంలో చెప్పిన విధంగా నరక లోకంలోని శిక్షలు భూమి మీద అమలు పరిస్తే? అంటూ యముడి సినిమా గురించి చెప్పారు.
దీంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి ఆ కథని తెరపై ఎలా చూపిస్తారో చూడాలి. ఇటీవలే ప్రీ ప్రొడక్షన్ వర్క పూర్తి చేసుకున్న యముడు సినిమా త్వరలోనే షూటింగ్ కి వెళ్లనుంది. త్వరలో సినిమా గురించి మిగిలిన వివరాలు వెల్లడించనున్నారు.