Yendira Ee Panchayithi : ‘ఏందిరా ఈ పంచాయితీ’ మూవీ నుంచి ‘ఏమో ఏమో’ సాంగ్ విడుదల..

విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న సినిమా 'ఏందిరా ఈ పంచాయితీ'. తాజాగా ఈ మూవీ నుంచి ‘ఏమో ఏమో’ అనే మెలోడీ సాంగ్..

Yendira Ee Panchayithi : ‘ఏందిరా ఈ పంచాయితీ’ మూవీ నుంచి ‘ఏమో ఏమో’ సాంగ్ విడుదల..

Yemo Yemo Lyrical Video song from Yendira Ee Panchayithi movie

Updated On : September 1, 2023 / 5:56 PM IST

Yendira Ee Panchayithi : విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీలు ఎప్పుడూ ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్‌ను ఇస్తుంటాయి. ఇప్పుడు టాలీవుడ్‌లో ఎక్కువగా ప్రేమ కథా చిత్రాలే వస్తున్నాయి. చిన్న చిత్రాలు పెద్ద విజయాన్ని సాధిస్తున్నాయి. ఇప్పుడు అందమైన గ్రామీణ ప్రేమ కథా చిత్రం ఒకటి రాబోతోంది. ‘ఏందిరా ఈ పంచాయితీ’ అనే ఈ మూవీ విలేజ్ లవ్ స్టోరీగా రాబోతోంది. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్.ఎం ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు ఈ చిత్రంతో హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు.

Bhagavanth Kesari : భగవంత్ కేసరి ఫస్ట్ సింగల్ వచ్చేసింది.. గణేష్ యాంతంకి బాలయ్య, శ్రీలీల..

ఇది వరకే ఈ మూవీ టైటిల్ లోగోను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక గ్లింప్స్ సైతం నెట్టింట్లో అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ రచయిత కోన వెంకట్ చేతుల మీదుగా ఏమో ఏమో అంటూ సాగే పాటను విడుదల చేశారు. పీఆర్ (పెద్దపల్లి రోహిత్) బాణీ, అనురాగ్ కులకర్ణి గాత్రం, సతీష్ మాసం విజువల్స్ ఈ పాటను మళ్లీ మళ్లీ వినాలి, చూడాలనేట్టుగా చేశాయి. ఈ మెలోడీ పాట ఎంతో వినసొంపుగా ఉంది. ఈ పాటకు పీఆర్ సాహిత్యాన్ని అందించారు.

Salaar : ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు నిరాశ త‌ప్ప‌దా..? స‌లార్ పోస్ట్‌పోన్ కానుందా..?

ఇక ఈ పాటను రిలీజ్ చేసిన అనంతరం కోన వెంకట్ మాట్లాడుతూ.. ‘గ్రామీణ వాతావరణంలో తెరకెక్కించిన ఈ పాట బాగుంది. కొత్త వాళ్లైనా చక్కగా నటించారు. హీరో హీరోయిన్ల జంట బాగుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి. నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చి పెట్టాలి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

ఈ సినిమాకు సతీష్ మాసం కెమెరామెన్‌గా, పీఆర్ (పెద్దపల్లి రోహిత్) సంగీత దర్శకుడిగా, జేపీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. వెంకట్ పాల్వాయి, ప్రియాంక ఎరుకల ఈ చిత్రానికి మాటలు అందించారు. కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, చిత్తూరు కుర్రాడు తేజ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.