ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యామిలీతో ఎన్టీఆర్..

స్టార్ హీరోలు బయట కనిపిస్తే.. అందులోనూ ఫ్యామిలీతో కనిపిస్తే అభిమానలు ఫుల్ హ్యాపీ అయిపోతారు.. వారి ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేస్తారు. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా ఎన్‌టీఆర్ ఎయిర్‌పోర్ట్‌తో తన ఫ్యామిలీతో కలిసి వస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు చిన్న బ్రేక్ ఇచ్చి దుబాయ్ ట్రిప్‌కి వెళ్లిన ఎన్టీఆర్.. తిరిగివస్తూ భార్య లక్ష్మీ ప్రణతి, కొడుకు అభయ్‌రామ్‌తో ఎయిర్‌పోర్ట్‌లో మాస్క్‌లతో కనిపించాడు.
దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నవంబర్ 22 నుంచి ఎన్టీఆర్ మళ్లీ ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్‌లో పాల్గొనబోతుండగా.. అంతుకుముందుగా దుబాయ్ టూర్‌కు ఫ్యామిలీతో వెళ్లొచ్చాడు ఎన్టీఆర్. కరోనా కారణంగా గత ఎనిమిది నెలలుగా ఇళ్లకే పరిమితమైన ఎన్టీఆర్.. గత వారం దుబాయ్‌కి వెళ్లారు.
ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్‌ఆర్ సినిమాలో నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో పాటు రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్వరలోనే ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్నారు.
Tarak Anna at airport ?#KomaramBheemNTR || @tarak9999 ❤️ || #NTR ? pic.twitter.com/BH9SmCRwb4
— Bhãrgäv Ram Simhadri (@Bhargav_Ram9999) November 18, 2020