ఐసోలేషన్ సెంటర్లుగా మారిపోయిన 10ప్రైవేట్ హాస్పిటళ్లు

ఐసోలేషన్ సెంటర్లుగా మారిపోయిన 10ప్రైవేట్ హాస్పిటళ్లు

Updated On : March 19, 2020 / 7:46 AM IST

నగరంలోని పది హాస్పిటళ్లను COVID-19 ఐసోలేషన్ సెంటర్లుగా మార్చేశారు. మహారాష్ట్రలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు 47కు చేరాయి. ఈ మేరకు ముంబై నగరంలోని 10ప్రైవేట్ హాస్పిటళ్లను ఐసోలేషన్ హాస్పిటళ్లుగా మార్చేశారు. జాస్లోక్, హెచ్ఎన్ రిలయన్స్, హిందూజ, కోకిలాబెన్, రహెజా, గురు నానక్, బొంబే, లీలావతి, ఫోర్టిస్, సెయింట్ ఎలిజబెత్ హాస్పిటల్స్ మొత్తం కలిసి 96ఐసోలేషన్ బెడ్ల సదుపాయం అందించనున్నాయి. (పరీక్షలు రాయకుండానే పైతరగతులకు, ప్రభుత్వం కీలక నిర్ణయం)

ఇవే కాకుండా వెస్టరన్ రైల్వేస్ జగజ్జీవన్ రామ్ హాస్పిటల్ మరో 10ఐసోలేషన్ వార్డులను ఆఫర్ చేస్తుంది. గతంలో కస్తూర్భా హాస్పిటల్ ఒక్కటే 126 ఐసోలేషన్ బెడ్లతో సేవలు అందిస్తుంది. పేషెంట్లే ట్రీట్‌మెంట్‌కు అయ్యే ఖర్చులు భరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. 

64ఏళ్ల వ్యక్తి హిందూజా హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి మార్చి 8న కరోనా కారణంగా మృతి చెందారు. మరికొన్ని హాస్పిటల్స్‌లోనూ త్వరలోనే ఐసీయూ వార్డులు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా టెస్టింగ్ సెంటర్లు ఉన్నది కేవలం 3మాత్రమే. రోజుకు 1000మంది కరోనా అనుమానితులను పరీక్ష చేయగలదు.