Sterilisations : బాబోయ్.. 7 గంటల్లో 101 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన డాక్టర్

10 కాదు 20 కాదు ఏకంగా 101 ఆపరేషన్లు.. అదీ జస్ట్ 7 గంటల్లోనే. ఈ షాకింగ్ ఘటన ఛత్తీస్ గఢ్ లో జరిగింది. ఓ డాక్టర్ ఏడు గంటలపాటు 101 మందికి కుటుంబ నియంత్రణ (ట్యూబెక్టమీ) శస్త్ర చికిత్సలు

Sterilisations : బాబోయ్.. 7 గంటల్లో 101 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన డాక్టర్

Sterilisations

Updated On : September 4, 2021 / 11:21 PM IST

Sterilisations : 10 కాదు 20 కాదు ఏకంగా 101 ఆపరేషన్లు.. అదీ జస్ట్ 7 గంటల్లోనే. ఈ షాకింగ్ ఘటన ఛత్తీస్ గఢ్ లో జరిగింది. ఓ డాక్టర్ ఏడు గంటలపాటు 101 మందికి కుటుంబ నియంత్రణ (ట్యూబెక్టమీ) శస్త్ర చికిత్సలు చేశాడు. ఇప్పుడీ వ్యవహారం దుమారం రేపుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఆ డాక్టర్ ఆపరేషన్లు చేయడంతో సర్వత్రా విమర్శలు వచ్చాయి. దీంతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Nokia 3310 : మార్కెట్లోకి వచ్చి 21 ఏళ్లు.. నాటి రోజులు గుర్తుచేసుకుంటున్న నెటిజన్లు

సుర్గుజా జిల్లా నర్మదాపూర్‌ ఆరోగ్య కేంద్రంలో ఆగస్టు 27న మెగా స్టెరిలైజేషన్‌ క్యాంప్‌ నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఒక డాక్టర్ రోజుకు 30 కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయాలి. కానీ ఈ క్యాంప్‌లో ఏకంగా 101 ఆపరేషన్లు చేశారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రభుత్వ సర్జన్‌ శస్త్ర చికిత్సలు నిర్వహించాడు. ఈ శస్త్ర చికిత్సలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మహిళల ఆరోగ్యం చూడకుండా ఇష్టమొచ్చినట్టు శస్త్ర చికిత్సలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Aadhaar number: మీ ఆధార్‌తో లింకింగ్ ఉన్న ఫోన్ నెంబర్ల గురించి తెలుసుకోండిలా..

విమర్శలు రావడంతో వైద్యారోగ్య శాఖ అధికారులు స్పందించారు. ఆగస్టు 29న ఆ జిల్లా వైద్యాధికారి పీఎస్‌ సిసోడియా వివరాలు వెల్లడించారు. సర్జికల్‌ స్పెషలిస్ట్‌ జిబ్నస్‌ ఎక్కా, మరో డాక్టర్‌ ఆర్‌ఎస్‌ సింగ్‌లకు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. ఈ ఘటనపై విచారణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటుచేశారు. దీనిపై వైద్యులు కమిటీకి ఓ నివేదిక ఇచ్చారని తెలుస్తోంది. ఆ రోజు శిబిరానికి పెద్ద ఎత్తున మహిళలు వచ్చారని కమిటీకి తెలిపినట్లు సమాచారం. దూర ప్రాంతాల నుంచి మహిళలు వచ్చారని, వారు మళ్లీ అంత దూరం నుంచి రాలేకపోతామని వాపోయారని, అందుకే శస్త్ర చికిత్సలు చేసినట్లు తెలుస్తోంది. మహిళల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు డాక్టర్లు వివరణ ఇచ్చారు. అయితే శస్త్ర చికిత్స చేయించుకున్న మహిళలంతా క్షేమంగా ఉన్నట్లు సమాచారం.