దేశంలోనే తొలిసారి : అపోలో ఆస్పత్రిలో 103 ఏళ్ల బామ్మకు కరోనా టీకా

దేశంలోనే తొలిసారి : అపోలో ఆస్పత్రిలో 103 ఏళ్ల బామ్మకు కరోనా టీకా

Updated On : March 10, 2021 / 11:34 AM IST

103 Year Old Woman Get Covid Vaccine : దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ రెండో విడత పంపిణీ చురుగ్గా సాగుతోంది. కర్ణాటకలో దేశంలోనే తొలిసారిగా ఓ శతాధిక వృద్ధురాలికి టీకా వేశారు. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, 45 ఏళ్లు దాటి కోమార్బిడిటీస్ వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకాలు వేస్తున్నారు.

దీంట్లో భాగంగా..బెంగళూరు రాజధాని బెంగళూరులోని అపోలో ఆసుపత్రిలో జె కామేశ్వరి అనే 103 ఏళ్ల బామ్మకు కరోనా టీకా వేశారు. దీంతో దేశంలోనే టీకా తీసుకున్న అత్యంత వృద్ధురాలిగా కామేశ్వరి రికార్డులకెక్కారు. నోయిడాకు చెందిన ఇంచుమించు అదే వయస్సున్న మరొకరికి బుధవారం (మార్చి 9,2021) టీకా వేసినట్టు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని బుద్ధనగర్‌కు చెందిన మహాబీర్ ప్రసాద్ మహేశ్వరి యూపీలో టీకా తీసుకున్న వారిలో అత్యంత వృద్ధ వ్యక్తి గా రికార్డులెక్కారు. ఈ క్రమంలో నిన్నటికి దేశవ్యాప్తంగా 2.40 కోట్ల మందికి కరోనా టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.