ఎక్కడికెళ్లినా వెంటాడి వేస్తాం : మోడీపై 111 మంది తమిళనాడు రైతులు పోటీ

ప్రధాన మంత్రి మోడీపై పోటీ చేస్తామంటున్నారు రైతులు. అవును ఇప్పటి వరకు పంటలు పండించిన వారు..ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా నుండి 1000 మంది రైతులు ఎన్నికల బరిలో నిలుస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. రైతుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బీజేపీ పాలన తీరుకు నిరసనగా రైతుల్ని పోటీకి దించుతున్నట్లు దక్షిణాది నదుల అనుసంధాన పథకం రైతు సంఘం ప్రకటించింది.
Read Also : చేయూత : AP ఎన్నికల్లో వికలాంగుల చూపు ఎటో
మోడీపై 111 మంది తమిళ రైతుల్ని బరిలో దించుతున్నట్లు సంఘం అధ్యక్షుడు అయ్యాకన్ను మార్చి 23వ తేదీ శనివారం ప్రకటించారు. తమ సమస్యలు పరిష్కరించండి మహాప్రభో అంటూ…ఢిల్లీలోని జంతర్ మంత్ వద్ద రైతులు గతంలో ఆందోళన కొనసాగించారు. దీనికి అయ్యాకన్ను నేతృత్వం వహించారు. కావేరీ వ్యవహారం, పంట రుణాల సమస్య, ఆత్మహత్యకు పాల్పడిన రైతులను ఆదుకోవాలంటూ వారు డిమాండ్ చేయడం జరిగింది.
ఈ సమస్యలు తీరకపోవడంతో ప్రధాని మోడీ దేశంలో ఎక్కడ నుంచి పోటీ చేసినా ఆయనపై నామినేషన్ వేసి నిరసన తెలియజేయాలని నిర్ణయించినట్లు ఆయన ఇదివరకే ప్రకటించారు. బీజేపీ ప్రకటించిన జాబితాలో మోడీ వారణాసి నుండి పోటీ చేస్తారని ప్రకటించారు. దీనితో వారణాసి నుండి మోడీకి పోటీగా 111 మంది రైతులు బరిలో ఉంటారని అయ్యాకన్ను ప్రకటించారు.
Read Also : నేను గెలిస్తే : హైదరాబాద్ ను దేశానికి 2వ రాజధాని చేస్తా