COVID19 cases in India: దేశంలో కొత్తగా 11,539 కరోనా కేసులు నమోదు.. రోజువారీ పాజిటివిటీ రేటు 3.75 శాతం
దేశంలో కొత్తగా 11,539 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనాకు ప్రస్తుతం 99,879 మంది చికిత్స తీసుకుంటున్నారని వివరించింది. యాక్టివ్ కేసులు ప్రస్తుతం 0.23 శాతంగా ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.59 శాతంగా ఉందని చెప్పింది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 12,783గా ఉందని పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం కలిపి 4,37,12,218కి చేరిందని వివరించింది.

COVID19 cases in India
COVID19 cases in India: దేశంలో కొత్తగా 11,539 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనాకు ప్రస్తుతం 99,879 మంది చికిత్స తీసుకుంటున్నారని వివరించింది. యాక్టివ్ కేసులు ప్రస్తుతం 0.23 శాతంగా ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం రికవరీ రేటు 98.59 శాతంగా ఉందని చెప్పింది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 12,783గా ఉందని పేర్కొంది. దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం కలిపి 4,37,12,218కి చేరిందని వివరించింది.
రోజువారీ పాజిటివిటీ రేటు 3.75 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. వారాంతపు పాజిటివిటీ రేటు 3.88 శాతంగా ఉందని చెప్పింది. దేశంలో నిన్న 3,07,680 కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది. మొత్తం 88.24 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు తెలిపింది. దేశంలో మొత్తం 209.67 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయని పేర్కొంది. వాటిలో 93.94 కోట్ల రెండో డోసులు, 13.52 కోట్ల మూడో డోసులు ఉన్నాయని వివరించింది. ఢిల్లీలో కొన్ని రోజులుగా ప్రతిరోజు 1,000కి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
Virushka scooty ride: అనుష్మను ఎక్కించుకుని ముంబైలో స్కూటీపై చక్కర్లు కొట్టిన విరాట్ కోహ్లీ