Bank Holidays March 2023: మార్చి నెలలో బ్యాంకులకు 12 రోజులు హాలిడేస్ .. తెలుగు రాష్ట్రాల్లో ఏఏ రోజుల్లో అంటే ..?

మార్చి నెలలో బ్యాంకులు 12 రోజులు మూతపడనున్నాయి. హోలీ సహా ఉగాది, శ్రీరామనవమితో పాటు పలు పండుగలు ఉన్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చిలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది.

Bank Holidays March 2023: మార్చి నెలలో బ్యాంకులకు 12 రోజులు హాలిడేస్ .. తెలుగు రాష్ట్రాల్లో ఏఏ రోజుల్లో అంటే ..?

Bank Holidays

Updated On : February 28, 2023 / 10:11 AM IST

Bank Holidays March 2023: మార్చి నెలలో బ్యాంకులు 12 రోజులు మూతపడనున్నాయి. హోలీ సహా ఉగాది, శ్రీరామనవమితో పాటు పలు పండుగలు ఉన్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చిలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. వీక్లీ ఆఫ్‌లు, సాధారణ సెలవు రోజులతో సహా మొత్తం ఈ నెలలో 12రోజులు పాటు బ్యాంకులు మూతపడతాయి. వీటిలో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు ఉండగా, మిగిలినవి దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో జరపుకునే పండుగలు, ప్రత్యేకమైన రోజులను కలుపుకొని సెలవుల జాబితాను సిద్ధం చేశారు. ఈ జాబితాను ఆర్బీఐ వెబ్‌సైట్‌లో విడుదల చేసింది.

Bank Holidays In January 2023 : జనవరిలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు అంటే..

మార్చి నెలలో బ్యాంకింగ్ రంగానికి ప్రత్యేకమైన నెలగా చెప్పుకుంటారు. ఎందుకంటే.. మార్చి నెలలోనే ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడంతో పనికూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే, ఆర్బీఐ విడుదల చేసిన జాబితా ప్రకారం మార్చి నెలలో 12రోజులు సెలవులురాగా.. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలతో పాటు మూడు ప్రధాన పండుగల సమయంలో బ్యాంకులు మూతపడనున్నాయి.

Scribbling on Bank Note : కరెన్సీ నోట్లపై రాతలుంటే చెల్లవు..! క్లారిటీ ఇచ్చిన కేంద్రం

మార్చి నెలలో బ్యాంక్ సెలవులు ఏఏ తేదీల్లో అంటే ..

◊   మార్చి 5, 12, 19, 26 తేదీల్లో ఆదివారం కావడంతో ఈ నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు.

◊   మార్చి 11, 25 తేదీల్లో రెండవ, నాల్గో శనివారాలు కావడంతో బ్యాంకులు మూసి ఉంటాయి.

◊   మార్చి 3(శుక్రవారం) – చుప్‌చార్ కుట్‌ (త్రిపుర రాజ‌ధాని అగ‌ర్త‌ల‌లో సెల‌వు)

◊   మార్చి 7 (మంగళవారం)- హోలీ (తెలుగు రాష్ట్రాల్లో సెలవు)

◊   మార్చి 8 ( బుధవారం) – హోలీ సందర్భంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో సెలవులు

◊   మార్చి 9 (గురువారం) – హోలీ పాట్నా

◊   మార్చి 22 (బుధవారం) – ఉగాది పర్వదినం ( తెలుగు రాష్ట్రాల్లో సెలవు)

◊   మార్చి 30 ( గురువారం) శ్రీరామనవమి (తెలుగు రాష్ట్రాల్లోసెలవు)