Uttar Pradesh : యూపీలో కుల,మతాలకు అతీతంగా సామూహిక వివాహాలు.. ఒక్కటైన 12 వేల జంటలు..

ఉత్తరప్రదేశ్‌లో కులాలకు, మతాలకు అతీతంగా సామూహిక వివాహాలు జరిగాయి. ప్రభుత్వం చేపట్టిన ఈ సామూహిక వివాహాల కార్యక్రమంలో 12,000మంది జంటలు ఒక్కటయ్యాయి.

Uttar Pradesh : యూపీలో కుల,మతాలకు అతీతంగా సామూహిక వివాహాలు.. ఒక్కటైన 12 వేల జంటలు..

12000 Couples Tie Knot In Mass Marriage Event In Uttar Pradesh (1)

Updated On : June 13, 2022 / 2:27 PM IST

12000 couples tie knot in mass marriage event in UP :  ఉత్తరప్రదేశ్‌లో కులాలకు, మతాలకు అతీతంగా సామూహిక వివాహాలు జరిగాయి. ప్రభుత్వం చేపట్టిన ఈ సామూహిక వివాహాల కార్యక్రమంలో 12,000మంది జంటలు ఒక్కటయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 60 జిల్లాల్లో జరిగిన ఈ సామూహిక పెళ్లిళ్ల ద్వారా 12 వేల జంటలు వివాహ బంధంలోకి అడుగుపెట్టాయి. కులాలలకు,మతాలకు అతీతంగా జరిగిన ఈ వివాహాల సందర్భంగా ప్రభుత్వం ఒక్కో వధువు ఖాతాలో రూ. 35 వేల చొప్పున జమ చేసింది.

రెండో విడత సామూహిక వివాహాలు జూన్ 17న నిర్వహించనున్నామని అధికారులు వెల్లడించారు. లక్నోలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అసిం అరుణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు చేయూత ఇవ్వడంతోపాటు వరకట్న దురాచారానికి అడ్డుకట్ట వేసేందుకే ప్రభుత్వం ఈ సామూహిక వివాహ కార్యక్రమం చేపట్టామని తెలిపారు.

పార్టీ నుంచి బహిష్కరించబడిన బీజేపీ అధికార ప్రతినిథునుపుర్ర శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల క్రమంలో యూపీలోని కొన్ని జిల్లాల్లో కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం నిర్వహించే ఈ సామూహిక వివాహాలు కులాలకు, మతాలకు అతీతంగా జరగటం విశేషం.