SBI Jobs : స్టేట్‌బ్యాంక్‌లో 1226 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్లు

డిస్ట్ర్కిప్టివ్‌ టెస్ట్‌ని 50 మార్కులకు నిర్వహిస్తారు. ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ లో లెటర్‌ రైటింగ్‌, ఎస్సే రైటింగ్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి.

SBI Jobs : స్టేట్‌బ్యాంక్‌లో 1226 సర్కిల్‌ బేస్డ్‌ ఆఫీసర్లు

Sbi

Updated On : December 13, 2021 / 4:54 PM IST

Sbi Jobs : ముంబైలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ విభాగం వివిధ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం  1226 పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో రెగ్యులర్‌1100, బ్యాక్‌లాగ్‌126 పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణత అర్హతగా నిర్ణయించారు. అభ్యర్ధుల వయస్సు 2021 డిసెంబరు 01 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే..అభ్యర్థులు 2000 డిసెంబరు 01 నుంచి 1991 డిసెంబరు 02 మధ్య జన్మించి ఉండాలి. ఆన్‌లైన్‌ రాతపరీక్ష(ఆబ్జెక్టివ్‌, డిస్ర్కిప్టివ్‌ టెస్ట్‌), స్ర్కీనింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

రాత పరీక్షలో భాగంగా ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌, డిస్ర్కిప్టివ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌ 120 మార్కులకు ఉంటుంది. దీనిలో నాలుగు సెక్షన్లు ఉంటాయి. ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌కి నెగెటివ్‌ మార్కింగ్‌ లేదు. ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ కు సంబంధించి 30 ప్రశ్నలు30 మార్కులు30 నిమిషాలు కేటాయిస్తారు. బ్యాంకింగ్‌ నాలెడ్జ్‌కు సంబంధించి 40 ప్రశ్నలు 40 మార్కులు 40 నిమిషాలు కేటాయిస్తారు. జనరల్‌ అవేర్‌నె్‌స/ఎకానమీకి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు 30 నిమిషాలు కేటాయిస్తారు. కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి 20 ప్రశ్నలు 20 మార్కులు 20 నిమిషాలు కేటాయిస్తారు.

డిస్ట్ర్కిప్టివ్‌ టెస్ట్‌ని 50 మార్కులకు నిర్వహిస్తారు. ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ లో లెటర్‌ రైటింగ్‌, ఎస్సే రైటింగ్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ రాతపరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తులను ఆన్‌లైన్‌లో పంపాల్సి ఉంటుంది. ఫీజు విషయానికి వస్తే ఇతరులు రూ.750 చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. దరఖాస్తుల చివరి తేదీ డిసెంబరు 29గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌ టెస్ట్‌ 2022 జనవరిలో జరుగుతుంది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: sbi.co.in/సంప్రదించగలరు.