Kendriya Vidyalaya : కేంద్రీయ విద్యాలయాల్లో 14,461 ఖాళీ పోస్టులు.. లోక్ సభలో వెల్లడించిన కేంద్రం
దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో 14,461 బోధన, బోధనేతర పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. మధ్యప్రదేశ్ లో అత్యధికంగా 1,277 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది.

Kendriya Vidyalaya
Kendriya Vidyalaya : దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో 14,461 బోధన, బోధనేతర పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. మధ్యప్రదేశ్ లో అత్యధికంగా 1,277 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా తమిళనాడులో 1,220, కర్ణాటకలో 1,053, పశ్చిమబెంగాల్ లో 1,043 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెల్లడించింది.
Central Government Jobs: కేంద్రంలో 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీ.. లోక్‌సభలో వెల్లడించిన ప్రభుత్వం
సిక్కింలో అత్యల్పంగా 12 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు సోమవారం కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణదేవి లోక్ సభలో ప్రకటించారు. ఖాళీల భర్తీ ప్రక్రియను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ప్రారంభించిందని వెల్లడించారు.