Manipur: ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూలు బస్సులు ఢీ.. 15 మంది విద్యార్థులు మృతి

అదే సమయంలో రెండు బస్సులు ఢీకొట్టుకున్నట్లు స్థానిక సాక్షులు తెలిపారు. ఈ రెండు బస్సులు యారిపోక్‭లోని తంబల్ను హైయర్ సెకండరీ పాఠశాలకు చెందినవని, ఇవి రెండు విద్యార్థుల్ని ఖోపుం ప్రాంతానికి విహారయాత్రకు తీసుకెళ్తున్నాయని స్థానిక పోలీసు అధికారి తెలిపారు.

Manipur: ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూలు బస్సులు ఢీ.. 15 మంది విద్యార్థులు మృతి

15 students feared dead in road accident in Manipur

Updated On : December 21, 2022 / 4:42 PM IST

Manipur: మణిపూర్ రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది స్కూలు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలోని నోని జిల్లాలో బుధవారం రెండు బస్సులు ఢీ కొట్టుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బిస్నాపూర్-ఖోపుం రోడ్డులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా ఒక బస్సు కంట్రోల్ తప్పిందట. అదే సమయంలో రెండు బస్సులు ఢీకొట్టుకున్నట్లు స్థానిక సాక్షులు తెలిపారు. ఈ రెండు బస్సులు యారిపోక్‭లోని తంబల్ను హైయర్ సెకండరీ పాఠశాలకు చెందినవని, ఇవి రెండు విద్యార్థుల్ని ఖోపుం ప్రాంతానికి విహారయాత్రకు తీసుకెళ్తున్నాయని స్థానిక పోలీసు అధికారి తెలిపారు.

అనేక మంది విద్యార్థులు ఈ ప్రమాదంలో గాయపడ్డారని, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో కొందరు తీవ్ర గాయాల మధ్య చికిత్స పొందుతున్నట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. అయితే పరిస్థితి చూస్తుంటే మరణాల సంఖ్య మరింతకు పెరగొచ్చనే ఆందోళనను స్థానికులు వ్యక్తం చేశారు.

Wear Masks In Crowded Places : కోవిడ్ ఇంకా ముగిసిపోలేదు, రద్దీ ప్రదేశాల్లో మాస్క్ ధరించండీ : కేంద్ర మంత్రి సూచనలు