దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

New Covid Cases దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 18 వేల 139 పాజిటివ్ కేసులు, 234 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,04,13,417కు చేరింది. మరణాల సంఖ్య 1,50,570కి చేరింది.
రికవరీ రేటు 96.39శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం కరోనా బాధితుల్లో 1,00,37,398 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారని తెలిపింది. ప్రస్తుతం దేశంలో 2,25,449 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.మరోవైపు,గడిచిన 24గంటల్లో 20,539 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
మరోవైపు, దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం చర్యలు ముమ్మరం చేసింది కేంద్రం ప్రభుత్వం. టీకా పంపిణీలో ఎదురయ్యే సవాళ్లను అంచనా వేసేందుకు ఇప్పటికే ఓసారి డ్రై రన్ నిర్వహించగా..ఇవాళ మరోమారు దేశవ్యాప్తంగా టీకా డ్రై రన్ నిర్వహిస్తోంది. ఉత్తర్ప్రదేశ్, హరియాణా రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా మొత్తం 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 736 జిల్లాల్లో ఈ డ్రై రన్ చేపడుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందుకోసం ఆయా ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి.