Madrasa : మదర్సాలో ఇద్దరు పిల్లలను గొలుసులతో కట్టి బంధించారు.. వీడియో!

Madrasa : యూపీలోని లక్నోలో దారుణం వెలుగుచూసింది. ఓ ఇద్దరు పిల్లలను గొలుసులతో కట్టిపడేశారు. అబ్బాయిల కాళ్లను చైన్లతో కట్టి బంధించారు.

Madrasa : మదర్సాలో ఇద్దరు పిల్లలను గొలుసులతో కట్టి బంధించారు.. వీడియో!

2 Boys Kept In Chains At Madrasa In Lucknow To Prevent Them From Running Away

Updated On : May 28, 2022 / 9:11 AM IST

Madrasa : యూపీలోని లక్నోలో దారుణం వెలుగుచూసింది. ఓ ఇద్దరు పిల్లలను గొలుసులతో కట్టిపడేశారు. అబ్బాయిల కాళ్లను చైన్లతో కట్టి బంధించారు. దీనికి సంబంధించిన వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. లక్నోలోని మదర్సా నుంచి పారిపోకుండా ఉండేందుకు ఇద్దరు పిల్లలను ఇలా కాళ్లకు గొలుసులతో కట్టి బంధించారు. మదర్సాలో చదువుకునేందుకు తమ ఇద్దరు అబ్బాయిలను చేర్పించారు. పిల్లలు ఇద్దరూ మదర్సా నుంచి పారిపోతారేమోనని వారి తల్లిదండ్రులు మౌలానాకు అప్పగించారు.

వారిద్దరి విషయంలో కొంచెం కఠినంగా ఉండాలని, లేదంటే పారిపోతారని తల్లిదండ్రులు సూచించారు. దాంతో మౌలానా ఆ ఇద్దరి పిల్లలను గొలుసులతో కట్టి బంధించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు రావడంతో పోలీసులు మదర్సాకు వెళ్లారు. ఆ పిల్లలను విడిపించిన పోలీసులు.. ఎందుకు ఇలా గొలుసులతో బంధించారో ప్రశ్నించారు.

ఈ క్రమంలో పిల్లల తల్లిదండ్రులు పోలీసులకు రాతపూర్వకంగా అభ్యర్థించారు. తమ పిల్లల పట్ల కఠినంగా ఉండమని తామే మౌలానాకు చెప్పామని వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని వేడుకున్నారు. పిల్లలకు చదువుపై ఇష్టం లేదని, వాళ్లు మదర్సా నుంచి పారిపోతారేమోనని ఇలా చేశారని చెప్పారు.

Read Also :  Terrorists Encounter : టీవీ నటిని హత్య చేసిన ఉగ్రవాదుల హతం..హత్య జరిగిన 24 గంటల్లోనే ఎన్‌కౌంటర్‌