గుజరాత్ 2002 అల్లర్లు: మోడీతో సహా మంత్రులందరికీ క్లీన్ చిట్

గుజరాత్ 2002 అల్లర్లు: మోడీతో సహా మంత్రులందరికీ క్లీన్ చిట్

Updated On : December 11, 2019 / 7:49 AM IST

2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి  విచారణ కమిషన్ నానావతి ప్యానెల్  రిపోర్ట్ ఇచ్చింది. మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులకు క్లీన్ చిట్ లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో కానీ, ప్రేరణతో గానీ ఈ ప్రమాదం జరగలేదని ఎటువంటి మంత్రి ప్రమేయం లేదని నానావతి కమిషన్ స్పష్టం చేసింది. 

2002లో జరిగిన అల్లర్లపై 2014లో రిటైర్డ్ జస్టిసెస్ జీటీ నానావతి, అక్షయ్ మెహతాల కమిటీ తుది రిపోర్టుతో ప్రముఖులకు ఉపశమనం లభించినట్లే. గుజరాత్ అల్లర్లలో వెయ్యి మందికి పైగా ప్రజలు చనిపోగా అందులో ఎక్కువ ముస్లింలే.  

ఈ కమిషన్‌ను 2002లో అల్లర్లపై విచారించాలని నరేంద్ర మోడీ ఏర్పాటు చేశారు. గాంధీనగర్‌కు 150కి.మీల దూరంలో ఉన్న గోద్రాలోని ఓ ట్రైన్‌లో ఫిబ్రవరి 27న 59మంది హిందువులను కాల్చి చంపిన ఘటన తర్వాత గుజరాత్ లో అల్లర్ల రేగాయి. 

మూడు రోజులన అల్లర్లలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని రిపోర్ట్ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో అల్లర్లను అదుపుచేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమైనట్లు అందులో పేర్కొన్నారు. దీనికి ప్రభుత్వానికి  ఎలాంటి బాధ్యత లేదని పేర్కొంది.