2020-21 బడ్జెట్ : ‘టీబీ హారేగా.. దేశ్ జీతేగా’: ఆరోగ్య రంగానికి రూ.69వేల కోట్లు 

  • Published By: veegamteam ,Published On : February 1, 2020 / 08:12 AM IST
2020-21 బడ్జెట్ : ‘టీబీ హారేగా.. దేశ్ జీతేగా’: ఆరోగ్య రంగానికి రూ.69వేల కోట్లు 

Updated On : February 1, 2020 / 8:12 AM IST

‘టీబీ హారేగా.. దేశ్ జీతేగా’ (టీబీ ఓడిపోతుంది.. దేశం గెలుస్తుంది) అనే కార్యక్రమాన్ని 2025 వరకు కొనసాగించనున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాల సీతారామన్ తెలిపారు. 2020-21 కేంద్ర బడ్జెట్‌ లో ఆరోగ్యానికి 69,000 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో మంత్రి ప్రకటించారు. ఇక ఔషదీ కేంద్ర పథకాన్ని దేశంలోని అన్ని జిల్లాల్లో 2024 వరకు కొనసాగించాలని నిర్ణయించామని తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాలను ఓడీఎఫ్‌లుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

కాగా..2025 నాటికి భారత్ టీబీ నిర్మూలన దిశగా కృషి చేస్తోందన్నారు  ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ, యునెస్కో ప్రధాన కార్యాలయంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాని మోడీ తెలిపిన విషయం తెలిసిందే. 2030 నాటికి టీబీ నిర్మూలన ప్రపంచ లక్ష్యంగా ఉందని అన్నారు.