PUBGకు బానిసై సూసైడ్ చేసుకున్న యువకుడు

  • Published By: veegamteam ,Published On : June 29, 2020 / 04:49 AM IST
PUBGకు బానిసై సూసైడ్ చేసుకున్న యువకుడు

Updated On : June 29, 2020 / 4:49 AM IST

మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. పబ్ జీ ఆడే అలవాటు వ్యసనంగా మారి ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. నిఖిల్ పురుషోత్తం పిలెవన్ అనే వ్యక్తి పింపిరి ముఖ్‌త్యర్ గ్రామంలో గురువారం కీలక నిర్ణయం తీసుకున్నాడు.

 

నిఖిల్ పూనెలోని ఓ ప్రైవేట్ ఫాంలో పనిచేస్తున్నాడు. బీఏ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంది. కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా మధ్యలోనే ఉండిపోయాడు. రోజుకు 16గంటల పాటు PUBG ఆడుతూ ఉండేవాడు. పనికోసం పేరెంట్స్ తో పాటు సోదరుడు బయటకు వెళ్లడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అన్న మాట్లాడుతూ.. PUBGకు బానిసగా మారడంతో ఇలా అయిపోయాడని అన్నాడు.

Read: 3రూపాయల 46 పైసల అప్పు కోసం రైతును 15 కి.మీ. నడిపించిన బ్యాంకు అధికారి