Delhi AIIMS : 7నెలలుగా అపస్మారకస్థితిలోనే ఉన్న మహిళకు సాధారణ ప్రసవం .. జన్మించిన బిడ్డ సురక్షితం

7నెలల నుంచి అపస్మారకస్థితిలోనే ఉన్న మహిళ ప్రసవించింది. సాధారణ ప్రసవం జరుగగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. జన్మించిన బిడ్డ సురక్షితంగా ఉంది.

Delhi AIIMS : 7నెలలుగా అపస్మారకస్థితిలోనే ఉన్న మహిళకు సాధారణ ప్రసవం .. జన్మించిన బిడ్డ సురక్షితం

Woman unconscious for 7 months gives birth with narmal delivary

Updated On : November 3, 2022 / 10:00 AM IST

Delhi AIIMS : టూవీలర్ పై ప్రయాణించేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వాహనం నడిపేవారితో పాటు వెనుక కూర్చున్నవారు కూడా హెల్మెట్ ధరించి తీరాలనే రూల్ ఉంది. కానీ నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యానికి ఫలితంగా ఓ గర్భిణి ఏడు నెలలుగా అపస్మాకరస్థితిలో ఉంది. ప్రమాదంలో గాయపడి ఏడు నెలలుగా అపస్మారకస్థితిలో ఉన్న ఓ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన ఢిల్లీ ఎయిమ్స్‌లో జరిగింది. బాధితురాలు ఏడు నెలలుగా అపస్మాకర స్థితిలోనే ఉన్నా గర్బంలో శిశువుకు మాత్రం ఎటువంటి ప్రమాదం జరగలేదు. తాజాగా అపస్మాకస్థితిలోనే బాధితురాలు పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వటం విశేషంగా మారింది..

ఉత్తరప్రదేశ్‌ బులంద్‌షహర్‌కు చెందిన 23 ఏళ్ల మహిళ 2022 ఏప్రిల్ 1 తెల్లవారుఝామున తన భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. అప్పటికి వారికి వివాహం జరిగి ఆరు వారాలు అయ్యింది. భార్యాభర్తలు ఇద్దరు హెల్మెట్లు ధరించలేదు. కానీ అదృష్టవశాత్తు భర్తకు ఏమీ కాలేదు. కానీ  ఆమెక తలకు బలమైన దెబ్బ తగిలింది. దీంతో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయి. ప్రమాదం జరిగినప్పటనుంచి బాధితులరాలు ఆసుపత్రిలోనే అచేతన స్థితిలో సుదీర్ఘకాలంగా చికిత్స పొందుతోంది. ఈ చికిత్సలో భాగంగా డాక్టర్లు పలు సర్జరీలు చేయాల్సి పరిస్థితి వచ్చింది. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడినా..అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. కళ్లు తెరుస్తుంది కానీ కదల్లేని స్థితిలో ఉండిపోయింది. ప్రమాద సమయంలో ఆమె గర్భవతి అని డాక్టర్లు గుర్తించారు. బాధితురాలు అపస్మాకర స్థితిలో ఉండటం..పలు సర్జరీలు చేయాల్సి రావటంతో డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధతో ఆమె ఆరోగ్య పరిస్థితితో పాటు గర్భంలో శిశువు గురించి కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. అలా ఏడు నెలలకే ఆడబిడ్డను ప్రసవించింది.

7 నెలలుగా కోమాలోనే కరోనా గర్భిణి : కళ్లుతెరిచేసరికి పండంటి కవలలు

ఈ ఘటన గురించి ఎయిమ్స్ న్యూరో సర్జన్ డాక్టర్ దీపక్ గుప్లా మాట్లాడుతూ..ఏప్రిల్‌ 1వ తేదీ తెల్లవారుజామున సదరు మహిళ ప్రాణాపాయ స్థితిలో ఢిల్లీ ఎయిమ్స్‌కు వచ్చిందని..ప్రమాదం జరిగిన సమయంలో ఆమె 40 రోజుల గర్భిణిగా ఉంది. వెంటనే తాము శిశువు ఆరోగ్యపరిస్థితి గురించి పరీక్షలు చేయగా శిశువు ఆరోగ్యంగా ఉందని గుర్తించాము. కుటుంబ సభ్యులు అబార్షన్‌కు ఒప్పుకోలేదు. దీంతో ఆమెను..గర్భంలోని బిడ్డ గురించి పలు జాగ్రత్తలు తీసుకున్నామని..ముఖ్యంగా ఆమెకు సర్జరీలు చేసిన సమయంలో మరింత జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ఈక్రమంలో ఇటీవల ప్రసవం చేసామని..ప్రస్తుతం ఆమె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిందని..కానీ బిడ్డకు పాలిచ్చే పరిస్థితుల్లో లేదని తెలిపారు. దీంతో పసికందుకు డబ్బా పాలు పడుతున్నామని డాక్టర్‌ దీపక్‌ గుప్తా వెల్లడించారు.

ఆమెకు ఈ ఏడు నెలల కాలంలో 5 న్యూరో సర్జరీలు చేశామని తెలిపారు. ఆమె ఇప్పటికి అపస్మాకర స్థితిలోనే ఉందని..చికిత్స కొనసాగించినా రాబోయే రెండేళ్లలో ఆమె కోలుకోవటానికి 10-15 శాతం అవకాశాలున్నాయని తెలిపారు. ఏడునెలలుగా ఆమె అపస్మాకర స్థితిలోనే ఉన్నా ఆమె సిజేరియన్ అవసరం లేకుండానే సాధారణ ప్రసవమే జరిగిందని..పుట్టిన ఆడబిడ్డ 2.5 కిలోల బరువుందని బిడ్డ ఆరోగ్యానే ఉందని తెలిపారు.

AIIMS న్యూరాలజిస్ట్ మాట్లాడుతూ..హెల్మెట్‌లు మరణ ప్రమాదాన్ని ముఖ్యంగా తలకు గాయం అయ్యే ప్రమాదాన్ని 50-60 శాతం తగ్గిస్తాయి. హెల్మెట్‌లతో, ఆసుపత్రిలో మరణాలు 16 శాతం తగ్గుతాయయని గర్భాశయ వెన్నెముక గాయాలు, ముఖానికి అయ్యే గాయాల సంఖ్య కూడా 12–60 శాతం కూడా తక్కువగా ఉన్నాయని తెలిపారు. కాబట్టి టూవీలర్ మీద ప్రయాణించేటప్పుడు హెల్మెట్ తప్పకుండా ధరించాలని సూచించారు.