బ్రేకింగ్ : రాజస్తాన్‌లోనదిలో పడ్డ పెళ్లి బస్సు..24మంది మృతి

  • Published By: veegamteam ,Published On : February 26, 2020 / 07:18 AM IST
బ్రేకింగ్ : రాజస్తాన్‌లోనదిలో పడ్డ పెళ్లి బస్సు..24మంది మృతి

Updated On : February 26, 2020 / 7:18 AM IST

రాజస్థాన్ లో ఘోర ప్రమాదం జరిగింది. కోటలాల్ సోట్ వద్ద హైవేపై నుంచి ఓ బస్సు నదిలో పడిపోయింది. టలాల్ సోట్ వద్ద హైవే పైనుంచి ఓ పెళ్లి బస్సు వెళుతుండగా అదుపు తప్పి బస్సు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదం సమయంలో బస్సులో 40మంది ఉండగా వారిలో 24మంది మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటిహుటినా ఘటనాస్థలానికి చేరుకున్నారు.

 

వెంటనే సహాయక చర్యల్ని ప్రారంభించారు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. నీటి ప్రవాహంలో చిక్కుకున్న మరికొంతమందిని అధికారులు రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.