Gujarat : గుజరాత్‌లో పిడుగుపాటుకు 27 మంది, 71 పశువులు మృతి
భారీ వర్షాలకు 23 మంది గాయపడ్డారని, 29 ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.

Gujarat lightning
Gujarat Lightning : గుజరాత్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. రాష్ట్రంలోని 251 తాలూకాల్లోని 230 తాలూకాలకు పైగా ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షాలు కురిశాయి. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్లు పిడుగుపాటుతో 27 మంది మృతి చెందారు.
డౌడ్, భరూచ్, తాపి, అహ్మదాబాద్, అమ్రెల్లి, బనస్కాంత, బొతాద్, ఖేడా, మెహ్ సానా, పంచ్ మహల్, సబర్ కాంత, సూరత్, సురేంద్రనగర్, దేవభూమి ద్వారకాలో అధిక మరణాలు సంభవించాయని అధికారులు పేర్కొన్నారు.
Earthquake : మూడు దేశాల్లో భారీ భూకంపం…సునామీ ముప్పు లేదు
స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నిర్వహించిన డేటా ప్రకారం సోమవారం మధ్యాహ్నం నాటికి పిడుగుపాటుతో 71 జంతువులు కూడా చనిపోయాయి. భారీ వర్షాలకు 23 మంది గాయపడ్డారని, 29 ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు.