Cough Syrup: దగ్గు మందుకు చిన్నారులు బలి, డాక్టర్లు సస్పెండ్

దగ్గు మందు తాగిన ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురై దుర్మరణం చెందారు. డ్రగ్ రియాక్షన్ దీనికి కారణమని తెలుసుకున్న అధికారులు మొహల్లా క్లినిక్ లోని డాక్టర్లను విధుల నుంచి తప్పించారు.

Cough Syrup: దగ్గు మందుకు చిన్నారులు బలి, డాక్టర్లు సస్పెండ్

Death

Updated On : December 21, 2021 / 1:22 PM IST

Cough Syrup: దగ్గు మందు తాగిన ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురై దుర్మరణం చెందారు. డ్రగ్ రియాక్షన్ దీనికి కారణమని తెలుసుకున్న అధికారులు ఢిల్లీలోని  మొహల్లా క్లినిక్ లోని డాక్టర్లను విధుల నుంచి తప్పించారు.  ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి  సత్యేంద్ర జైన్ విచారణ జరిపి ఘటనపై నిజాలు రాబట్టాలని అధికారులను ఆదేశించారు.

మొహల్లా క్లినిక్ లో అక్టోబర్ 13న ఓ చిన్నారికి దగ్గు వస్తుండటంతో వైద్యులు సూచించిన మందు వాడారు. అప్పటికీ తగ్గకపోవడంతో కళావతి సరన్ చిల్డ్రన్ హాస్పిటల్ లో చేర్చగా.. చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. మిగతా ఇద్దరు కూడా అదే నెలలో ప్రాణాలు కోల్పోయారు.

‘వారి మరణాలు చాలా దురదృష్టకరం. విషయం పూర్వాపరాలు తెలుసుకోవడానికి విచారణ జరుపుతున్నాం. దీనికి బాధ్యులైన వైద్యులను విధుల్లో నుంచి తొలగించాం. ఢిల్లీ ప్రభుత్వం ఈ విషయంపై ఢిల్లీ మెడికల్ కౌన్సిల్ కు విచారణ జరపాలని లేఖ ద్వారా కోరింది. సీడీఎమ్ఓ డా.గీతా నేతృత్వంలో విచారణ కమిటీ పనిచేస్తుంది’ అని చెప్పారు మంత్రి. ఏడు రోజుల్లోనే నిజాలు తెలుసుకుంటామనే నమ్మకాన్ని కనబరిచారు జైన్.

…………………………………..: లక్కీ ఛాన్స్.. ఈ వారం నానీ, రణ్వీర్‌లదే..!

ఈ విషయం కాస్త రాజకీయ రంగు పులుముకుంది. అధికార ప్రభుత్వం ఆమ్ఆద్మీ పార్టీపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఓట్లు కావాలనుకుంటే ఏకంగా మరణాలకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

………………………………………….: కిడ్నీలో రాళ్ళను కరిగించే చిట్కాలు