35 ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు ICMR నిర్ణయం

  • Published By: veegamteam ,Published On : March 27, 2020 / 06:23 AM IST
35 ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు ICMR నిర్ణయం

Updated On : March 27, 2020 / 6:23 AM IST

దేశంలోని కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 733 కు పెరిగిపోవటంతో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కరోనా పరీక్షలు ప్రభుత్వ హస్పిటల్ కే పరిమితయ్యాయి. తాజాగా కరోనా పరీక్షలను ప్రైవేట్ ల్యాబ్ లకు అనుమతులను ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించటానికి 35 ప్రైవేట్  కి ల్యాబ్ లకు అనుమతులు జారీ చేస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)తెలిపింది.

కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించేందుకు తొమ్మిది రాష్ట్రాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఢిల్లీ లో ఆరు ల్యాబ్, గుజరాత్ లో నాలుగు, హర్యానాలో మూడు, కర్ణాటక లో రెండు, మహారాష్ట్రలో తొమ్మిది, ఒడిశా లో ఒకటి, తమిళనాడులో నాలుగు, పశ్చిమ బెంగాల్ లో ఒకటి ,తెలంగాణాలో ఐదు ప్రైవేట్ ల్యాబ్ లకు ICMR నుంచి ఆమోదం లభించింది.

డయాగ్నొస్టిక్ సర్వీసెస్ ప్రొవైడర్ డాక్టర్ లాల్ పాత్ లాబ్స్ కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించటం ప్రారంభించింది. కోవిడ్ 19 టెస్టు చేయాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్ టెస్టు ఫీజు రూ.4500, టెస్టింగ్ ఫలితాలు రావటానికి రెండురోజుల సమయం పడుతుంది.
 
తెలంగాణలో కోవిడ్ 19 టెస్టింగ్ కి 5 ల్యాబ్‌లకు అనుమతి లభించింది. ఏపీలోని ఏ హస్పిటల్స్ కి అనుమతి లభించలేదు. ఈ పరీక్ష నిర్వహించే హస్పిటల్స్ అన్ని హైదరాబాద్ కు చెందినవే. అందులో మెుదటిది జూబ్లీహిల్స్ అపోలో, హిమాయత్ నగర్‌లోని విజయ డయాగ్నస్టిక్స్, ఐడీఏ చర్లపల్లిలోని విమతా ల్యాబ్స్, సికింద్రాబాద్ అపోలో, పంజాగుట్టలోని డాక్టర్ రెమెడీస్ ల్యాబ్స్ లో అందుబాటులో ఉన్నాయి.