Uttar Pradesh : యూపీలో దారుణం.. అగ్నిప్రమాదంలో 38 గోవులు మృతి
ఉత్తర ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గోశాలలోని 38 గోవులు మంటల్లో చిక్కుకొని మృతి చెందాయి. ఇందిరాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోనికనవాని గ్రామంలోని గోశాల వద్ద సోమవారం మధ్యాహ్నం ..

Cows Death
Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గోశాలలోని 38 గోవులు మంటల్లో చిక్కుకొని మృతి చెందాయి. ఇందిరాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోనికనవాని గ్రామంలోని గోశాల వద్ద సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. గోశాలకు సమీపంలోని డంపింగ్ యార్డులో మంటలుచెలరేగడంతో గోశాలకు అంటుకొని ఆవులు కాలి బూడిదయ్యాయని స్థానికులు తెలిపారు. శ్రీ కృష్ణ గోశాల నిర్వాహకుడు సూరజ్ పండిట్ తెలిపిన వివరాలప్రకారం.. మంటలు చెలరేగిన సమయంలో దాదాపు 150 ఆవులు ఉన్నాయని, దానికి సమీపంలో డంపింగ్ యార్డు ఉండటంతో మంటలు చెలరేగి గోశాలకు అంటుకున్నాయని తెలిపారు. ఇదిలా ఉంటే ఈ విషయంపై జిల్లా కలెక్టర్ రాకేష్ కుమార్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
VR headsets for Cows : ఆవులకు వీఆర్ హెడ్‌సెట్లు..పాల ఉత్పత్తి పెరగటంతో రైతు ఫుల్ హ్యాపీ
తొలుత ఘటన స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ 15 నుంచి 20 పశువులు మంటల్లో చిక్కుకొని చనిపోయి ఉంటాయని తెలిపారు. అయితే పూర్తి విచారణఅనంతరం ఎన్ని గోవులు చనిపోయాయి, మంటలు ఎలా వ్యాపించాయి అనే విషయాలపై స్పష్టత వస్తుందని అన్నారు. ఇదిలా ఉంటే ఘజియాబాద్పోలీస్ చీఫ్ మునిరాజ్ ఘటన స్థలాన్ని సందర్శించారు.అగ్నిమాపక యంత్రాల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చేలా కృషి చేశారు. సోమవారంసాయంత్రం సమయంలో కమిటీ సభ్యులు ఘటనపై విచారణ చేపట్టారు.
Cows Died : విశాఖ జ్ఞానానంద ఆశ్రమంలో సరైన పోషణ లేక.. 12 ఆవులు మృతి
ఇందిరాపురం సర్కిల్ ఆఫీసర్ అభయ్ కుమార్ మిశ్రా ఈ ఘటనపై విచారణ నిర్వహించి మంటలు వ్యాపించి ఘటనలో 38 ఆవులు చనిపోయినట్లు స్పష్టం చేశారు. విచారణలో పాల్గొన్న వారిలో సభ్యులలో ప్రధాన అగ్నిమాపక అధికారి, జిల్లా ముఖ్య అభివృద్ధి అధికారి ఉన్నారు. ఇదిలా ఉంటే గోశాలకు సమీపంలోనే ఒక డంప్ యార్డు ఉందని, ఎండ వేడిమితో మధ్యాహ్నం సమయంలో మంటలు అంటుకున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.