240 క్రిమినల్ కేసులు : 4 పేజీల యాడ్ : బీజేపీ టికెట్ పై పోటీ

ఆ రోజు గురువారం (ఏప్రిల్ 18, 2019). కేరళలోని పతనమిట్టలో ఉదయం ఎప్పటిలానే న్యూ పేపర్ వచ్చింది.

  • Published By: sreehari ,Published On : April 19, 2019 / 01:44 PM IST
240 క్రిమినల్ కేసులు : 4 పేజీల యాడ్ : బీజేపీ టికెట్ పై పోటీ

ఆ రోజు గురువారం (ఏప్రిల్ 18, 2019). కేరళలోని పతనమిట్టలో ఉదయం ఎప్పటిలానే న్యూ పేపర్ వచ్చింది.

ఆ రోజు గురువారం (ఏప్రిల్ 18, 2019). కేరళలోని పతనమిట్టలో ఉదయం ఎప్పటిలానే న్యూ పేపర్ వచ్చింది. పేపర్ లో న్యూస్ ఏంటో చూద్దామని అక్కడి రీడర్లు పతనమిట్ట ఎడిషన్ తెరిచి చూశారు. అంతే.. ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ ఎడిషన్ లో మొత్తం నాలుగు పేజీల Advertisement వింతగా అనిపించింది. తొలుత అదేదో కంపెనీ ప్రొడక్ట్ యాడ్, ప్రభుత్వం టెండర్ నోటీస్ యాడ్ అయి ఉంటుంది అనుకున్నారు చదివే వాళ్లంతా. దగ్గరగా పరిశీలిస్తేగానీ తెలియలేదు వారికి.. అది సాధారణ యాడ్ కాదు.. ఓ రాజకీయ నేత క్రిమినల్ కేసుల చిట్టా అని తెలిసి నివ్వెరపోయారు. బీజేపీ పతానామితట్ట అభ్యర్థిగా కె. సురేంద్రన్.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 
Also Read : Voiceతోనే టైపింగ్ : వచ్చే ఐదేళ్లలో Keyboards ఉండవు

కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలనుసారం.. అభ్యర్థులందరూ తప్పకుండా తమ క్రిమినల్ రికార్డులను న్యూస్ పేపర్లలో ప్రచురించాలి. ఎన్నికల సంఘం సూచనల ప్రకారం.. మూడు న్యూస్ పేపర్లు లేదా.. సింగిల్ పేపర్ లో ప్రచురించాలి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ వివరాలన్నీ పోలింగ్ కు ముందే ప్రజలకు తెలిసేలా ప్రచురించాల్సిందిగా సూచించింది. దీంతో బీజేపీ అభ్యర్థి సురేంద్రన్ కూడా తమ నేర చరిత్రను పేపర్లో ప్రచురించారు. తనపై నమోదైన 240 క్రిమినల్ కేసుల రికార్డును నాలుగు పేజీల్లో ప్రచురించారు. 

కేరళలోని బీజేపీ అనుబంధ పత్రిక ‘జన్మభూమి’లో సురేంద్రన్ నేర చరిత్రను ప్రచురించారు. కేరళ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సురేంద్రన్పై కేసులు ఉన్నాయి. కానీ, ఇందులో 90 శాతం కేసులు శబరిమలకు సంబంధించిన కేసులే ఉన్నాయి. శబరిమల ఆలయంలోకి ప్రవేశ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనల్లో ఈయనే ప్రధాన పాత్ర పోషించాడు. కేరళలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో జైలుకు కూడా వెళ్లాడు.
Also Read : చెక్ చేశారా? : ఇన్ స్టాగ్రామ్‌లో.. మీ Likes కనిపించవు

పతానామితట్ట లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సురేంద్రన్ పై హత్యాయత్నం కేసు (శబరిమలలోకి మహిళను ప్రవేశించకుండా అడ్డుకున్నందుకు), హింసకు పురిగొల్పడం, ప్రమాదకర ఆయుధాలతో గాయపరచడం, పబ్లిక్ ప్రాపర్టీలను ధ్వంసం చేయడం, ప్రజా రహదారులను నిర్బంధించడం, అసభ్యపదజాలం వాడటం వంటి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

240 క్రిమినల్ కేసులకు సంబంధించి అన్ని వివరాలను ఆ పత్రికలోని నాలుగు పేజీల్లో ప్రచురించారు. కొల్లాం జిల్లాలో సురేంద్రన్ పై 68 కేసులు మాత్రమే ఉండగా, తిరువనంతపురంలో 3 కేసులు, పతనామితట్టలో 30 కేసులు, అల్ఫుజుహాలో 56 కేసులు, కొట్టాయంలో 8 కేసులు, ఇడుక్కిలో 17 కేసులు, ఎర్నాకులంలో 13 కేసులు, త్రిసూర్ లో 6 కేసులు, కోజికోడ్ లో 2 కేసులు, కాసరగాడ్ లో 33 కేసులు, మలప్పురం, వాయ్ నాడ్, కన్నూర్ (ఒక్కో ప్రాంతంలో ఒక కేసు)తో కలిపి మొత్తం 3 కేసులు నమోదయ్యాయి.  
Also Read : TikTok బ్యాన్ : ఇండియాలో 100 కోట్ల పెట్టుబడికి మరో ప్లాన్