చెరువులో మునిగి ఐదుగురు చిన్నారులు మృతి..కాపాడేందుకు వెళ్లిన యువకుడు కూడా

పంజాబ్ రాష్ట్రంలోని​ లుథియానా జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది.

చెరువులో మునిగి ఐదుగురు చిన్నారులు మృతి..కాపాడేందుకు వెళ్లిన యువకుడు కూడా

Ludhiana

Updated On : May 14, 2021 / 9:27 PM IST

Ludhiana పంజాబ్ రాష్ట్రంలోని​ లుథియానా జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మన్​ఘడ్​ గ్రామంలో చెరువులో స్నానానికి వెళ్లిన ఐదుగురు చిన్నారులు ప్రమాదవశాత్తు మునిగిపోయారు. మృతులంతా 4-10 ఏళ్ల వయస్సు వాళ్లే. వారిని కాపాడేందుకు యత్నించిన 22 ఏళ్ల యువకుడు సైతం మునిగిపోయాడు. మృతులంతా 4-10 ఏళ్ల వయస్సు వాళ్లే.

మొదట ఐదుగురు చిన్నారుల్లో ఒకరు స్నానం చేసేందుకు చెరులోకి దిగి.. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. ఆ చిన్నారిని రక్షించేందుకు ఒడ్డున ఉన్న మిగతా నలుగురు చెరువులోకి దిగారు. వారు కూడా మునిగిపోగా.. చిన్నారులను కాపాడేందుకు వచ్చిన యువకుడు సైతం మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. మరణించిన చిన్నారుల్లో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు కాగా వారి బంధువులంతా శోక సంద్రంలో మునిగిపోయారు. ఇప్పటివరకు ముగ్గురు చిన్నారులు మరియు యువకుడి మృతదేహాలను వెలికితీశామని,ఇంకా ఇద్దరి కోసం గాలిస్తున్నామని లుధియానా డిప్యూటీ కమిషనర్ వీరేందర్ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన సీఎం అమరీందర్ సింగ్ బాధిత కుటుంబాలకు 50వేల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.