కోహ్లీ భార్య అనుష్క ఎందుకు ఈ విమెన్ క్రికెటర్ బయోపిక్ చేయడానికి ఒప్పుకుంది?

  • Published By: chvmurthy ,Published On : January 15, 2020 / 11:08 AM IST
కోహ్లీ భార్య అనుష్క ఎందుకు ఈ విమెన్ క్రికెటర్ బయోపిక్ చేయడానికి ఒప్పుకుంది?

Updated On : January 15, 2020 / 11:08 AM IST

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శ‌ర్మ, భార‌త మ‌హిళా క్రికెట‌ర్ ఝుల‌న్ గోస్వామి బ‌యోపిక్‌లో ప్రధానపాత్ర పోషిస్తోంది. ఈబయో పిక్ లో  అనుష్క నటించడానికి ఝుల‌న్ గోస్వామి జీవిత చరిత్రే ప్రధాన కారణం. ఎందుకంటే ఆమె భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించడంతో పాటు జట్టు విజ‌యాల‌లో చాలాసార్లు ప్రధానపాత్ర పోషించింది. 2002లో తొలి వ‌న్డే మ్యాచ్ ఆడిన గోస్వామి ఇటీవ‌ల టీ-20ల‌కి రిటైర్మెంట్ ప్ర‌క‌టించింది. భారత మహిళా క్రికెట్ గతిని మార్చిన మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి.
 Jhulan goswamy
పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో గోస్వామి ప్రయాణం మొదలైంది. ఆమె చిన్నతనం నుంచే మగపిల్లలతో ఆడి ఆమె తనలోని క్రీడా పటిమను మెరుగుపరుచుకుంది. కోల్‌కతాలోని  వివేకానంద పార్క్‌లో ఆమె శిక్షణ పొందింది. 1997 లో మహిళా ప్రపంచ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియాతో ఆమె స్పూర్తి పొందింది. ఆమ్యాచ్ కు ఆమె బాల్ గర్ల్ గా పని చేసింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మాజీ అంతర్జాతీయ క్రికెటర్ బెలిండా క్లార్క్ విజయం ఆమెను అంతర్జాతీయ క్రికెటర్ గా మారేందుకు తీవ్ర ప్రభావం చూపింది.గోస్వామి తన 19 ఏళ్ల వయస్సులో  2002వ సంవత్సరంలో చెన్నైలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగ్రేటం చేశారు.

anushka jhulan
గోస్వామి 2006-07 సీజన్‌లో ఇంగ్లాండ్‌లో జరిగిన తొలి టెస్ట్ సిరీస్ విజయానికి భారత మహిళల క్రికెట్ జట్టుకు మార్గనిర్దేశం చేసింది. 2007 లో, ఆమె ఐసిసి ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది, ఆ సంవత్సరం ఏక్రికెటర్ కూడా వ్యక్తిగత అవార్డును అందుకోలేదు. 2009 లో ఇంగ్లాండ్‌లో జరిగిన మహిళల టి -20 ప్రపంచ కప్ మొదటి  పోటీలకు  ఆమె భారతదేశానికి కెప్టెన్‌గా వ్యవహరించింది.

గోస్వామి తన కెరీర్‌లో 10 టెస్టులు, 169 వన్డేలు ఆడారు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో ఎక్కువ వికెట్లు పడగొడుతున్న పేసర్ ఉందంటే అది గోస్వామినే.  ఆమెకు వన్డేల్లో 200వికెట్లు తీసిన మహిళా క్రికెటర్‌గా కూడా పేరుంది. 2007లో ఐసీసీ వుమెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును అందుకుంది. 2010లో అర్జున అవార్డుతో పాటు 2012లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది.

jhulan 200 wickets odi

పశ్చిమ బెంగాల్‌లోని చక్దా పట్టణానికి చెందిన  గోస్వామి భారతదేశంలో మహిళా సాధికారత పై ఉద్యమం చేస్తున్న న్యాయవాది, ఇటీవల కోల్‌కతాలోని We The Women అనే కార్యక్రమంలో బర్ఖా దత్‌, అనామికా ఖన్నా, మాళవికా బెనర్జీలతో కలిసి పాల్గోన్నారు.