Road Accident : రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు పోలీసులు మృతి

జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రక్కును పోలీసు వాహనం ఢీకొనడంతో ఆరుగురు పోలీసు అధికారులు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు.

Road Accident : రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు పోలీసులు మృతి

road accident (15) (1)

Rajasthan Road Accident : రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చురు జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో ఆరుగురు పోలీసులు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున జిల్లాలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రక్కును పోలీసు వాహనం ఢీకొనడంతో ఆరుగురు పోలీసు అధికారులు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. సుజన్‌గఢ్ సర్కిల్ అధికారి షకీల్ ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు అధికారులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిరంగ సభ కోసం బందోబస్తుకు వెళ్తున్నారు.

మార్గంమధ్యలో కనోటా చెక్‌పోస్ట్ సమీపంలోని నేషనల్ హై-58 వద్ద ఉదయం 5.30 సమయంలో ఘటన చోటు చేసుకుంది. పోలీసు వాహనం డ్రైవర్ ఎదురుగా వస్తున్న నీల్‌గాయ్‌ను ఢీకొట్టకుండా తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ అదుపు తప్పి ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టాడు. దీంతో వాహనంలోని ఆరుగురు పోలీసులు మృతి చెందారు.

Fire Accident : విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన 40 బోట్లు

మృతి చెందిన పోలీసు అధికారులు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ రాంచంద్ర, కానిస్టేబుళ్లు కుంభారం, సురేష్ మీనా, తానారామ్, మహేంద్ర, సుఖరామ్‌లుగా గుర్తించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, రాజస్థాన్ డీజీపీ ఉమేష్ మిశ్రా మృతులకు సంతాపం తెలిపారు.

చురులోని సుజన్‌గఢ్ సదర్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలీసు అధికారులు మరణించడం విషాదకరమని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన పోలీసులందరి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని పోస్ట్ చేశారు.