Grandma Dance : రెండు జడల 62 ఏళ్ల బామ్మ ‘కోయి లడ్కి హై’ పాటకు డ్యాన్స్ ఇరగదీసిందిగా..
62 ఏళ్ల బామ్మ అలనాటి అందాల హీరోయిన్ మాధురీ దీక్షిత్ పాటకు డ్యాన్స్ వేసి నెటిజన్లు ఫిదా చేసారు.‘కోయి లడ్కి హై’ పాటకు బామ్మగారి డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

62 Years Old Women Dance
Grandma Koi Ladki Hai song Dance : 62 ఏళ్ల బామ్మ అలనాటి అందాల హీరోయిన్ మాధురీ దీక్షిత్ పాటకు డ్యాన్స్ వేసి నెటిజన్లు ఫిదా చేసారు. మాధురీ దీక్షిత్ అంటే అందం అభినయం కలగలిసిన నటి. ఆమే డాన్స్ వేస్తే కళ్లార్పకుండా చూసేవారు అభిమానులు. అద్భుతమైన డ్యాన్స్ వేసిన ఎన్నో పాటలు మాధురీ లిస్టులో ఉన్నాయి. ఐటెమ్ సాంగ్స్ తో ఆమె కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. డ్యాన్స్ అంటే కాళ్లతోనే కాదు కళ్లతో కూడా అభినయాలు పలికించవచ్చని మాధురీదీక్షిత్ పాటలు చూస్తే తెలుస్తుంది. అటువంటి పాటల్లో Tezaab సినిమాలో ‘ఏక్ దో తీన్’ సాంగ్ ఎవర్ గ్రీన్. ఈ పాటలోని రిథమ్, సాంగ్, మాధురి లుక్స్, స్టెప్ప్ ఇవన్నీ ఎప్పటికీ ఎవర్ గ్రీనే.
అలా మాధురీ దీక్షిత్ సూపర్ హిట్ సాంగ్స్ లో ‘కోయి లడ్కి హై’ పాట కూడా ఒకటి. ఆ పాటకు 62 ఏళ్ల బామ్మ వేసిన డ్యాన్స్ చూసి తీరాల్సిందే. అలానే దిల్ తో పాగల్ హై సినిమాలోని ఫేమస్ సాంగ్ ‘కోయి లడ్కి హై’కు మాధురీ దీక్షిత్ అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఇప్పుడు ఇదే స్టైల్లో 62 ఏళ్ల రవి బాల శర్మ అనే బామ్మ రెండు పిలకలు వేసుకొని డ్యాన్స్ చేసింది.
గులాబీ రంగు కుర్తా, తెలుపు పలాజో ధరించి అదిరిపోయే స్టెప్పులతో అచ్చం మాధురి దీక్షిత్‌ను గుర్తు చేసింది. అచ్చంగా మాధురిని దింపేసింది. బామ్మగారి కోయి లడ్కి హై పాట డాన్స్ వేసిన బామ్మగారు సోషల్ మీడియాలో డ్యాన్స్ క్వీన్ అయిపోయారు. ఈ పాట సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. పాత వీడియోనే అయినప్పటికీ ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది.మిలియన్ వ్యాస్ రాబట్టిన ఈ వీడియోపై మీరు ఓ లుక్ వేయండి.
View this post on Instagram
View this post on Instagram