ట్రంప్‌కు స్వాగతం పలకటానికి 70లక్షల మంది జనం..!!

  • Published By: veegamteam ,Published On : February 21, 2020 / 05:16 AM IST
ట్రంప్‌కు  స్వాగతం పలకటానికి 70లక్షల మంది జనం..!!

Updated On : February 21, 2020 / 5:16 AM IST

అగ్ర రాజ్యాధినేత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఫిబ్రవరి 24-25 తేదీల్లో భారత్ లో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ కు ఘన స్వాగతం పలకటానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 24 మ.12 గంటలకు అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో ట్రంప్ ఫ్లైట్ ల్యాండ్ కానుంది. దీంతో ట్రంప్ మెప్పుకోసం బీజేపీ ప్రభుత్వం తెగ తాపత్రాయపడుతోంది. ట్రంప్ ఘన స్వాగత పలికేందుకు ఏకంగా 70లక్షలమంది సంప్రదాయ దుస్తుల్లో అహ్మదాబాద్ విమానాశ్రయానికి హాజరుకానున్నట్లుగా తెలుస్తోంది. ‘నమస్తే ప్రెసిడెంట్ ట్రంప్’ కార్యక్రమం మోతేరా స్టేడియం వరకు రోడ్ షో ఏర్పాట్లకు అన్ని పూర్తయ్యాయి. 

దీనిపై నెటిజన్లు పలువిధాలుగా స్పందిస్తున్నారు. అహ్మదాబాద్ జనాభా 56లక్షల మంది. అటువంటప్పుడు 70లక్షల మంది ఎలా వస్తారు? వేరే ప్రాంతం నుంచి ప్రజలను తరలిస్తారా?  రాజకీయ బహిరంగ సభలకు సమీకరించినట్లుగా ట్రంప్ కు స్వాగతం పలకటానికి ప్రజలను సమీకరిస్తారేమో అనంటూ సెటైర్లు వేస్తున్నారు. ట్రంప్ ను ఏకంగా దేవుడిగా భావిస్తు బీజేపీ ప్రభుత్వం చాలా ఎక్కువ చేస్తోందని విమర్శలు సంధిస్తున్నారు.  ట్రంప్ భారత్ కు రావటానికి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న హంగామా అంత అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై శివసేన కూడా స్పందిస్తూ..ట్రంప్ కోసం బీజేపీ చేస్తున్న ఏర్పాట్లు చూస్తుంటే..ఇది బానిస మనస్తత్వాన్ని ప్రతిబింభిస్తోందంటూ విమర్శలు కురిపించింది. 

ట్రంప్ రాకకు గుజరాత్ ప్రభుత్వం..కేంద్రప్రభుత్వ ఏర్పాట్లు
24న అహ్మదాబాద్​కు ట్రంప్ రాక
ఆహ్వానించనున్న మోడీ.. 22 కిలోమీటర్ల రోడ్ షో
సబర్మతి ఆశ్రమానికి వెళ్లనున్న ట్రంప్, మెలానియా
వల్లభాయ్ స్టేడియంలో ‘నమస్తే ప్రెసిడెంట్ ట్రంప్’ ప్రోగ్రామ్
దారి పొడవునా స్వాగతం పలకనున్న 70లక్షల మంది  ప్రజలు
500ల క్యూసెక్కుల నీళ్లు 
10వేల మంది సెక్యూరిటీ 
ముఖ్యమైన ప్రాంతాల్లో 65 మంది అసిస్టెంట్‌ కమిషనర్లు, 200 మంది ఇన్స్‌పెక్టర్లు, 800 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు పర్యవేక్షణ 
రోడ్ల నిర్మాణం కోసం గుజరాత్ ప్రభుత్వం పెడుతున్న ఖర్చు రూ.500కోట్లు
మురికివాడలు కనిపించకుండా కడుతున్న గోడలకు రూ.60కోట్ల ఖర్చు 
ఇలా గుజరాత్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం ట్రంప్ రాకకు చేసే హంగామా అంతా ఇంతా కాదు.