సోలార్ కుకింగ్ : ట్రెండ్ సెట్ చేస్తున్న 75 ఏళ్ల అవ్వ

మొక్కజొన్న కంకులను బొగ్గుల్లో, గ్యాస్ పైనో కాల్చి అమ్ముతుండటం మనందరం చూస్తూనే ఉంటాం. అయితే నేటి జనరేషన్ యూత్ కంటే  తానేమీ తక్కువ కాదంటోంది ఓ వృద్ధ మహిళ. వాళ్లే కాదు నేను ట్రెండ్ సెట్ చేయగలనంటూ నిరూపించింది.

  • Published By: veegamteam ,Published On : January 28, 2019 / 06:01 AM IST
సోలార్ కుకింగ్ : ట్రెండ్ సెట్ చేస్తున్న 75 ఏళ్ల అవ్వ

Updated On : January 28, 2019 / 6:01 AM IST

మొక్కజొన్న కంకులను బొగ్గుల్లో, గ్యాస్ పైనో కాల్చి అమ్ముతుండటం మనందరం చూస్తూనే ఉంటాం. అయితే నేటి జనరేషన్ యూత్ కంటే  తానేమీ తక్కువ కాదంటోంది ఓ వృద్ధ మహిళ. వాళ్లే కాదు నేను ట్రెండ్ సెట్ చేయగలనంటూ నిరూపించింది.

మొక్కజొన్న కంకులను బొగ్గుల్లో, గ్యాస్ పైనో కాల్చి అమ్ముతుండటం మనందరం చూస్తూనే ఉంటాం. అయితే నేటి జనరేషన్ యూత్ కంటే  తానేమీ తక్కువ కాదంటోంది ఓ వృద్ధ మహిళ. వాళ్లే కాదు నేను ట్రెండ్ సెట్ చేయగలనంటూ నిరూపించింది. 75 ఏళ్ల వయస్సులోనూ క్రియేటివ్ గా ఆలోచిస్తోంది. సోలార్ పవర్ ను ఉపయోగిస్తూ మొక్కజొన్న కంకులను కాల్చి అమ్ముతూ అందరినీ ఆకర్షిస్తోంది.

బెంగళూరుకు చెందిన సెల్వమ్మా (75) 20 ఏళ్ళుగా కర్ణాటక అసెంబ్లీ ఎదురుగా ఓ చిన్న తోపుడు బండి పెట్టుకుని మొక్కజొన్న కంకులు అమ్ముకుంటు జీవనం సాగిస్తోంది. అయితే ఏళ్లుగా కంకులను కాలడం వల్ల ఆమె చేతులు కందిపోయాయి. కందిపోయిన చేతులతో కష్టం చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంది. ఈ సమయంలో ఆమె కష్టం చూసిన ఓ ఎన్జీవో సంస్థ ఆమెకు సోలార్ ఫ్యాన్ బహుమతిగా ఇచ్చారు. గతంలో సెల్వమ్మకు కంకులను కాల్చి అమ్మేందుకు చాలా కష్టమయ్యేది. అయితే ఇప్పుడు సోలార్ ఉపయోగించి కేవలం నిమిషాల్లోనే కాల్చిన కంకులను రెడీ చేసి అమ్ముతూ.. తాను కూడా ట్రెండ్ ఫాలో అవుతానంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.