7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. దీపావళికి ముందే 4శాతం డీఏ పెంపు..? జీతం ఎంత పెరగనుందంటే?
7th Pay Commission : పండుగల సీజన్ ప్రారంభం కావడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల పెంపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 7వ వేతన సంఘంలో భాగంగా అక్టోబర్‌లో డియర్‌నెస్ అలవెన్స్ పెంపు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

7th Pay Commission_ 4 Percent DA hike likely for govt employees before Diwali
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పనుంది. దీపావళి పండగకు ముందే తీపికబురు అందించనుంది. పండుగల సీజన్ ప్రారంభం కావడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల పెంపు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 7వ వేతన సంఘంలో భాగంగా అక్టోబర్‌లో డియర్‌నెస్ అలవెన్స్ పెంపు ప్రకటన కోసం వారంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also : iPhone 16 vs iPhone 17 : కొత్త ఐఫోన్ కావాలా? ఐఫోన్ 16 కొంటే బెటరా? ఐఫోన్ 17 కోసం వేచి ఉండాలా?
మార్చి 2024లో 4శాతం పెరిగిన తర్వాత ప్రస్తుతం, డీఏ ప్రాథమిక వేతనంలో 50శాతం వద్ద ఉంది. ఈ సమయంలో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రభుత్వం 4శాతం డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచవచ్చని భావిస్తున్నారు. దాంతో డీఏ 53 శాతానికి చేరే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు, గతేడాది అక్టోబర్ మొదటి వారంలో డీఏ పెంచినందున దీపావళికి ముందే అక్టోబర్‌లో డీఏ పెంపును ప్రభుత్వం ప్రకటించాలని భావిస్తున్నారు.
డీఏ పెంపు ఎందుకంటే? :
వినియోగదారుల ధరల సూచిక ఆధారంగా వారి జీతాలను సర్దుబాటు చేయడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడంలో సాయపడేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచింది. ప్రస్తుతం, ఒక కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఈ భత్యం నుంచి ప్రయోజనం పొందుతున్నారు. పెరుగుతున్న జీవన వ్యయాలను భర్తీ చేయడంలో కీలకమైనదిగా చెప్పవచ్చు.
డీఏ పెంపును ఎలా లెక్కిస్తారంటే? :
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ఫార్ములా గత 12 నెలలకు సంబంధించి ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ లేదా (AICPI) సగటు ఆధారంగా రూపొందించింది. కార్మిక శాఖ విడుదల చేస్తుంటుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగుల జీతాల గణనలో కీలకమైన అంశంగా చెప్పవచ్చు.
ఒకవేళ ఈ అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం డీఏను ప్రకటించినా.. జూలై 1 నుంచే అమలు చేస్తుందని చెప్పవచ్చు. గత ఏడాదిలో డీఏ పెంపు ప్రకటన కూడా అక్టోబర్ మొదటివారంలోనే వచ్చింది. ఇప్పుడు కూడా అలానే రావొచ్చని భావిస్తున్నారు. ఇప్పుడు డీఏ పెరిగితే.. పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (DR) కూడా పెరుగుతుంది. దాంతో ఉద్యోగులు, పెన్షనర్లు లాభపడే అవకాశం ఉంటుంది.
జీతం ఎంత పెరుగుతుందంటే? :
వినియోగదారుల ధరల సూచికను అనుసరించి వారి వేతనాన్ని సర్దుబాటు చేయడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవటానికి కేంద్రం నుంచి డీఏను అందిస్తుంది. డీఏ అనేది కనీస/మూల వేతనంపై పనిచేస్తుంది. ఉదాహరణకు.. ఒక ప్రభుత్వ ఉద్యోగి నెల జీతం రూ. 30వేలు ఉంటే.. బేసిక్ పే రూ.18వేలు అనుకుందాం.. ప్రస్తుతం 50శాతం డీఏ కింద రూ.9వేలు డీఏగా పొందుతున్నట్లయితే.. 3శాతం డీఏ పెంచితే.. ఆ ఉద్యోగి నెలవారీ భత్యం రూ.540 పెరగవచ్చు. కేంద్రం డీఎను 4 శాతంగా పెంచితే అప్పుడు డీఏ కూడా రూ. 9,720కి పెరుగుతుంది.
Read Also : OnePlus Pad Discount : కొత్త టాబ్లెట్ కొంటున్నారా? వన్‌ప్లస్ ట్యాబ్‌పై భారీ డిస్కౌంట్.. ధర ఎంత తగ్గిందంటే?