ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హై అలర్ట్ : బోర్డర్ లో అపాచీ హెలికాఫ్టర్ల మోహరింపు

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హై అలర్ట్ : బోర్డర్ లో అపాచీ హెలికాఫ్టర్ల మోహరింపు

Updated On : September 3, 2019 / 6:41 AM IST

పాకిస్తాన్‌పై దాడి చేయడానికి భారత్ వేగం పెంచింది. యుద్ధ సన్నాహాల్లో భాగంగా మల్టీ పర్పస్‌గా వాడగల 8 హెలికాప్టర్లను రంగంలోకి దించింది. అమెరికాలో తయారుచేసిన అపాచీ గార్డియన్ ఎటాక్ AH-64E హెలికాప్టర్లను పఠాన్ కోట్‌లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో దర్శనమిచ్చాయి. ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. 

భారత ఎయిర్ ఫోర్స్ దళంలో Mi-35 fleetకు బదులుగా వీటిని కొనుగోలు చేసినట్లు చీఫ్ మార్షల్ తెలిపారు. ఎలాంటి వాతావరణానికైనా తట్టుకోగల శక్తి వీటికి ఉంటుంది. ఘాజియాబాద్‌లో ఉన్న ఐఏఎఫ్ హిండన్ ఎయిర్‌బేస్‌కు జులై 27నే చేరుకున్నాయి. ఆ తర్వాత పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ కు వాటిని తీసుకొచ్చారు. 

అపాచీ హెలికాప్టర్లు ప్రపంచంలోనే అత్యథిక సామర్థ్యం గలవి. ఒక్క నిమిషంలో 128టార్గెట్లు ఎయిమ్ చేయగలవు. ఎటువంటి కవచాలనైనా బ్రేక్ చేయగల గన్ షిప్స్‌తో ఉండనున్నాయి. 70మి.మీ హెడ్రా రాకెట్స్(నేలపై నుంచి ప్రయోగించగలవి), గాల్లోనే కాల్పులు జరపగల సామర్థ్యంతో ఉన్నవి ప్రయోగించగలవు. ఇవే కాకుండా 39మి.మీ చైన్ గన్(1200 రౌండ్లు పేల్చగలదు)తో భారీ ఆయుధాలను సైతం ధ్వంసం చేయగలవు. 

360డిగ్రీలు దీనిని కవర్ చేసుకోగలదు. ముందుగా వచ్చే వాహనాలను సెన్సార్ ద్వారా పసిగట్టేస్తుంది. చీకట్లోనూ చూడగల కెపాసిటీ ఉంది. యుద్ధంలో వాడే మోడరన్ ఎలక్ట్రానిక్ ఎక్విప్‌మెంట్‌తో డిజైన్ చేశారు. కశ్మీర్ అంశంలో పాక్‌తో యుద్ధం తప్పదనుకున్న పరిస్థితుల్లో వీటినే ముందుగా ప్రయోగించే సూచనలు కనిపిస్తున్నాయి.