కారులో 8 అడుగుల పొడవైన పైథాన్

8-Foot Long Python హర్యానా రాష్ట్రంలోని హిస్సార్ లోని ఆటో మార్కెట్‌లో నిలిపి ఉన్న కారులో నుంచి 8 అడుగుల పొడవైన పైథాన్‌ను అటవీ శాఖ అధికారులు బుధవారం రక్షించారు. పైథాన్‌ను పట్టుకున్న అనంతరం అధికారులు దాన్ని జింకల పార్కులో వదిలేశారు.
తన కారు వెనుక భాగంలో భారీ పాము కనిపించిందని ఆటో మార్కెట్‌లోని ఓ వ్యక్తి సమాచారం ఇచ్చారని, తమ బృందం అక్కడికి చేరుకుని దాన్ని రక్షించిందని,అనంతరం దాన్ని జింకల పార్కులో వదిలిపెట్టినట్లు అటవీ శాఖ ఇన్‌స్పెక్టర్ రామేశ్వర్ దాస్ తెలిపారు. 25-30 కిలోల బరువున్న పైథాన్ 8 అడుగుల పొడవుతో ఆరోగ్యంగా ఉందని తెలిపారు.
#WATCH Haryana: An 8-feet-long python rescued by Forest Department in Hisar today. It was later handed over to the authorities at the Deer Park, Hisar. pic.twitter.com/wLrF4JMoWW
— ANI (@ANI) October 7, 2020