Quit India Movement: క్విట్ ఇండియాకు 80ఏళ్లు.. బ్రిటీష్ వారి నిష్క్రమణకు నాంది పలికిన మహోద్యమం
75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆగస్టు 15న హట్టహాసంగా జరుపుకొనేందుకు దేశం సిద్ధమవుతోంది. 200 సంవత్సరాల తర్వాత ఎన్నో ఉద్యమాలు, పోరాటాలతో పాటు ఎందరో స్వాతంత్ర సమరయోధుల ప్రాణాల త్యాగాలతో 1947 ఆగష్టు 15న బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం లభించింది.

Quit India Movement
Quit India Movement: 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆగస్టు 15న హట్టహాసంగా జరుపుకొనేందుకు దేశం సిద్ధమవుతోంది. 200 సంవత్సరాల తర్వాత ఎన్నో ఉద్యమాలు, పోరాటాలతో పాటు ఎందరో స్వాతంత్ర సమరయోధుల ప్రాణాల త్యాగాలతో 1947 ఆగష్టు 15న బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం లభించింది. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం చాలా కాలం పాటు సాగింది. దాదాపు 100 సంవత్సరాల పాటు.. బ్రిటీష్ రాజ్ సంకెళ్ల నుండి దేశానికి విముక్తి కోసం పోరాటం సాగింది.. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో అనేక సంఘటనలు జరిగినప్పటికీ, వాటిలో అనేకం బ్రిటీష్ రాచరికాన్ని ప్రధానాంశంగా తిప్పికొట్టాయి. అందులో ఒకటి క్విట్ ఇండియా ఉద్యమం.
Netaji’s great-granddaughter: నేతాజీ సుభాష్ చంద్రబోస్ మునిమనవరాలు రాజశ్రీ చౌదరి బోస్ హౌస్ అరెస్ట్
1942 ఆగస్టు 8న మహాత్మా గాంధీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమం బ్రిటిష్ వారి నిష్క్రమణను వేగవంతం చేసింది. ఈ ఉద్యమం ఆల్-ఇండియా కాంగ్రెస్ కమిటీ యొక్క బొంబాయి సెషన్‌లో ప్రారంభించబడింది. బ్రిటిష్ పాలనను అంతం చేయాలనే గాంధీజీ యొక్క స్పష్టమైన పిలుపుతో ఈ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగింది. ఇప్పుడు ఆగస్టు క్రాంతి మైదాన్‌గా పిలవబడే ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదాన్‌లో గాంధీజీ ఆవేశపూరితంగా ప్రసంగించారు. “డూ ఆర్ డై అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
Freedom Fighter Azad: చంద్రశేఖర్ తివారీకి ‘ఆజాద్’ అని పేరెందుకొచ్చిందో తెలుసా ..
క్విట్ ఇండియా ఉద్యమంలో అరుణా అసఫ్ అలీ గోవాలియా ట్యాంక్ మైదాన్‌లో భారత జెండాను ఎగురవేశారు. క్విట్ ఇండియా ఉద్యమం మూడు దశలుగా జరిగింది. మొదటి దశలో పట్టణలో తిరుగుబాటు, సమ్మెలు, బహిష్కరణలు జరిగాయి. రెండవ దశలో ప్రధాన రైతు తిరుగుబాటు జరిగింది. ఇది రైల్వే ట్రాక్‌లు, స్టేషన్‌లు, టెలిగ్రాఫ్ వైర్లు, స్తంభాలు, ప్రభుత్వ భవనాలు వంటి బ్రిటిష్ రాజ్ సంబంధించి కనిపించే చిహ్నాలను నాశనం చేయడం ద్వారా బ్రిటీషర్ల వెన్నులో వణుకు పుట్టించింది.
Freedom Fighters: బ్రిటీష్ పాలకులను తమ పోరాటాలతో తరిమికొట్టిన ప్రముఖుల్లో కొందరు
భారతదేశానికి డొమినియన్ హోదాను అందించిన క్రిప్స్ మిషన్ వైఫల్యం ఉద్యమం వెనుక ప్రధాన అంశం. విస్తృతమైన బ్రిటిష్ వ్యతిరేక సెంటిమెంట్, సంపూర్ణ స్వాతంత్ర్యంకోసం పెరుగుతున్న ప్రజా మద్దతు కారణంగా.. క్విట్ ఇండియా ఉద్యమం విజయవంతమైంది. అనేక చిన్న ఉద్యమాలు. మిలిటెంట్ ఆవిర్భావాలు ఉద్యమంతో జతకట్టాయి. మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం ఆజాద్, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ వంటి భారత జాతీయ కాంగ్రెస్‌లోని పలువురు సీనియర్ నాయకులను బ్రిటీష్ వారు వెంటనే అరెస్టు చేశారంటే ప్రజా మద్దతుతో ఉద్యమం ఎంత మహోద్యమంగా మారిందో అంచనా వేయొచ్చు.
Indian Independence Movement: భారత స్వాతంత్ర ఉద్యమ సమయంలో పలు ఘట్టాలకు సంబంధించిన అరుదైన చిత్రాలు ..
క్విట్ ఇండియా ఉద్యమం ప్రజలతో ప్రతిధ్వనించినప్పటికీ.. బ్రిటిష్ వారు భారతదేశానికి తక్షణ స్వాతంత్ర్యం ఇవ్వడానికి నిరాకరించారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత మాత్రమే మీ దేశం నుంచి వెళ్లిపోతామని తెలిపారు. మనం భారత్ ను వదిలివెళ్లాల్సిన సమయం వచ్చిందని బ్రిటీష్ వారికి క్లారిటీ వచ్చేలా చేసిన ఉద్యమంగా క్విట్ ఇండియా నిలుస్తుంది. క్విట్ ఇండియా ఉద్యమం యొక్క ప్రాముఖ్యతను గుర్తించడానికి ప్రతీయేటా ఆగస్టు 9న క్రాంతి దివస్ జరుపుకుంటారు.