కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం : 9 మంది మృతి 

వేగం వద్దు నిదానమే ముద్దు అని సూక్తులు వాహనాలపై చూస్తుంటాం. కానీ స్పీడ్ మాత్రం తగ్గించుకోం.. ఫలితంగా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

  • Published By: veegamteam ,Published On : March 22, 2019 / 07:56 AM IST
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం : 9 మంది మృతి 

Updated On : March 22, 2019 / 7:56 AM IST

వేగం వద్దు నిదానమే ముద్దు అని సూక్తులు వాహనాలపై చూస్తుంటాం. కానీ స్పీడ్ మాత్రం తగ్గించుకోం.. ఫలితంగా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

విజయపూర్ : వేగం వద్దు నిదానమే ముద్దు అని సూక్తులు వాహనాలపై చూస్తుంటాం. కానీ స్పీడ్ మాత్రం తగ్గించుకోం..ఫలితంగా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 9మంది మృతి చెందారు. మరో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. 218 జాతీయ రహదారిపై విజయపూర్ జిల్లా సిండగి తాలూకా చిక్కసిండగి వద్ద శుక్రవారం (మార్చి 22) ఉదయం జరిగింది.
Read Also : నాకేం తక్కువ : రెండు కాళ్లతో నడిచేస్తున్న బుజ్జి మేక

కలబుర్గి జిల్లాలోని చిత్తాపూర్‌కు చెందిన కొందరు యువకులు హోలీ పండుగ సందర్భంగా గోవా వెళ్లారు. అనంతరం తిరుగు ప్రయాణంలో భాగంగా.. వారు ప్రయాణిస్తున్న వాహనం చిక్కసిండగి వద్దకు రాగానే ఓ ట్రక్కును వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను విజయపూర్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో 218 నేషనల్ హైవే పై వాహనాలు భారీగా నిలిచిపోవటంతో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉండటంతో పరిస్థితి భీతావాహంగా మారింది. అతివేగంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. 
Read Also : మరోసారి హార్రర్ చిత్రంలో మిల్కీబ్యూటీ!