Bomb Threat : పట్నా రైల్వే జంక్షన్ కు బాంబు బెదిరింపు

బీహార్ లోని పట్నా రైల్వే జంక్షన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో రైల్వే స్టేషన్ లో కలకలం రేగింది. పట్నా రైల్వే జంక్షన్ లో బాంబు పెట్టామని సోమవారం అగంతకుడు ఫోన్ చేసి చెప్పాడు.

Bomb Threat : పట్నా రైల్వే జంక్షన్ కు బాంబు బెదిరింపు

bomb threat

Updated On : December 20, 2022 / 12:49 PM IST

Bomb Threat : బీహార్ లోని పట్నా రైల్వే జంక్షన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో రైల్వే స్టేషన్ లో కలకలం రేగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్నా రైల్వే జంక్షన్ లో బాంబు పెట్టామని సోమవారం అగంతకుడు ఫోన్ చేసి చెప్పాడు.

దీంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రైల్వే స్టేషన్ లో హై అలర్ట్ ప్రకటించారు. బాంబ్ స్క్వాడ్ వచ్చి బాంబు కోసం రైల్వే జంక్షన్ మొత్తం గాలించారు.

Mumbai Hotel Bomb Threat Call : ముంబై ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్ కు బాంబు బెదిరింపు కాల్..రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్

కానీ ఎక్కడ కూడా బాంబు జాడ కనిపించలేదు. దీంతో అది ఆకతాయి పనేనని పోలీసులు నిర్ధారించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు చేస్తున్నామని పట్నా రైల్వే స్టేషన్ ఇంచార్జీ రంజిత్ కుమార్ పేర్కొన్నారు.