BJP MPs: బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, మనోజ్ తివారీలపై కేసు నమోదు.. ఎందుకంటే..
జార్ఖండ్‌లోని డియోఘర్ విమానాశ్రయంలో తమ చార్టర్డ్ ఫ్లైట్‌ను రాత్రి టేకాఫ్ కోసం క్లియరెన్స్ చేయమని అధికారులను బలవంతం చేసినందుకు బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, మనోజ్ తివారీ, మరో ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

BJP MPs
BJP MPs: జార్ఖండ్‌లోని డియోఘర్ విమానాశ్రయంలో తమ చార్టర్డ్ ఫ్లైట్‌ను రాత్రి టేకాఫ్ కోసం క్లియరెన్స్ చేయమని అధికారులను బలవంతం చేసినందుకు బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, మనోజ్ తివారీ, మరో ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. విమానాశ్రయ డీఎస్పీ సుమన్ అనన్ ఫిర్యాదు మేరకు బీజేపీ నేతలపై కేసు నమోదు చేశారు. నిషికాంత్ దూబే, మనోజ్ తివారీ సహా మరికొంత మంది వ్యక్తులపై ఇతరుల ప్రాణాలకు, భద్రతకు అపాయం కలిగించడం, నేరపూరిత నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు మోపారు.
NASA Artemis Launch: నేడు మరోసారి చంద్రుడిపైకి ఆర్టెమిస్ -1 ప్రయోగం .. ఏ సమయానికంటే?
ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఆగస్టు 31న లోక్‌సభ ఎంపీ నిషికాంత్ దూబే, ఆయన కుమారుడు కనిష్క్ కాంత్ దూబే, మహికాంత్ దూబే, ఎంపీ మనోజ్ తివారీ, ముఖేష్ పాఠక్, దేవతా పాండే, పింటూ తివారీలు హై సెక్యూరిటీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)లోకి ప్రవేశించారు. డియోఘర్ విమానాశ్రయంలో అనుమతి లేకుండా, వారి చార్టర్డ్ విమానానికి క్లియరెన్స్ ఇవ్వాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అయితే, కొత్తగా ప్రారంభించబడిన విమానాశ్రయం కావడంతో రాత్రి కార్యకలాపాలకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఇదిలా ఉంటే తనపై వచ్చిన ఎఫ్‌ఐఆర్‌పై నిషికాంత్ దూబే మాట్లాడుతూ.. విమానాశ్రయం అథారిటీ అభ్యంతరం చెప్పలేదు. మేము ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ నుండి అనుమతి తీసుకున్నాము. నేను కేసుపై పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.